Begin typing your search above and press return to search.

టాలీవుడ్ పై ఇమ్రాన్ హ‌ష్మీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

ఇప్పుడీ న‌యా హీరో టాలీవుడ్ లో కూడా లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 Feb 2024 5:30 PM GMT
టాలీవుడ్ పై ఇమ్రాన్ హ‌ష్మీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!
X

బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హ‌ష్మీ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. సీరియ‌ల్ కిస్స‌ర్ గా బ్రాండ్ ఇమేజ్ సంపాదించిన ఇమ్రాన్ బాలీవుడ్ లోనే ఓ సంచ‌ల‌నం. కొన్నాళ్ల పాటు సీరియ‌ల్ కిస్స‌ర్ ఓ వెలుగు వెలిగిన న‌టుడు. అయితే అత‌డి సెకెండ్ ఇన్నింగ్స్ మాత్రం అంద‌కు భిన్నంగా సాగుతుంది.

తానే ఆ ర‌క‌మైన ఇమేజ్ అవ‌స‌రం లేద‌నుకున్నాడా? లేక ఆ ర‌క‌మైన అవ‌కాశాలు రాక సీరియల్ కిస్స‌ర్ గా చెల‌రేగులేదా? అన్న‌ది తెలియ‌దు గానీ...సెకెండ్ ఇన్నింగ్స్ లో మాత్రం చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తున్నాడు. దీనికి తోడు కుమారుడు క్యాన్స‌ర్ బారిన ప‌డ‌టంతో వ్య‌క్తిగ‌తంగా ఎంతో చితికిపోయాడు. ఆ స‌మ‌యంలో తానెంత క్షోభ ప‌ట్టాడో? తెలిసిందే. అలాంటి కొన్ని స‌న్నివేశాలు ఇమ్రాన్ లో చాలా మార్పులే తీసుకొచ్చాయి.

ఇప్పుడీ న‌యా హీరో టాలీవుడ్ లో కూడా లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `ఓజీ` చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. గ్యాంగ్ స్ట‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కు తోన్న చిత్రంలో ఇమ్రాన్ విల‌న్ పాత్ర పోషిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. అయితే ఈ విష‌యా న్ని యూనిట్ ఇంకా రివీల్ చేయ‌లేదు. దీంతో అత‌డి పాత్ర పై కాస్త స‌స్పెన్స్ కొన‌సాగుతోంది.

తాజాగా ఇమ్రాన్ హాష్మీ సొంత ప‌రిశ్ర‌మ‌ని త‌క్కువ చేసి టాలీవుడ్ ని హైప్ చేస్తూ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక రంగా మారాయి. ఇటీవ‌లే ఓ ఇంట‌ర్వ్యూలో సౌత్..నార్త్ ఇండ‌స్ట్రీల మ‌ధ్య తేడాలేంటి? అంటే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. సౌత్ ఫిలిం మేక‌ర్స్ బాలీవుడ్ మేక‌ర్స్ కంటే క్ర‌మ‌శిక్ష‌ణ క‌ల‌వార‌న్నారు. బాలీవుడ్ సినిమాకి డ‌బ్బు విచ్చ‌ల విడిగా ఖ‌ర్చు చేస్తార‌ని..అవ‌స‌రం లేక‌పోయినా ఖ‌ర్చు పెడ‌తార‌ని...కానీ సౌత్ లో అలాకాద‌న్నారు.

`ఓ సినిమాకి ఎంత అవ‌స‌ర‌మే అంతే ఖ‌ర్చుచేస్తారు. అదీ చాలా జాగ్ర‌త్త‌గా ఖ‌ర్చు చేస్తారు. అవ‌న‌స‌ర ఖ‌ర్చు ఉండ‌దు. సౌత్ లో ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. ఖర్చు చేసిన డబ్బులు సినిమా రూపంలో కనిపి స్తాయి. విఎఫ్ ఎక్స్..పాథ్ బ్రేకింగ్ స్టోరీల విష‌యంలో సౌత్ మేక‌ర్స్ మాకంటే ముందున్నారు` అని అన్నారు. ఇప్పడీ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. బాలీవుడ్ మేక‌ర్స్ ..నిర్మాత‌లు కుళ్లుకు నేలాగా క‌నిపిస్తున్నాయి. మ‌రి ఇమ్రాన్ వ్యాఖ్య‌ల‌పై బాలీవుడ్ నుంచి ఎవ‌రైనా రియాక్ట్ అవుతారా? అన్న‌ది చూడాలి.