Begin typing your search above and press return to search.

20 ఏళ్ల వైరానికి ముగింపు ప‌లికిన జంట‌

అయితే సెట్స్‌లో ఏం తేడా కొట్టిందో కానీ హష్మిపై ఒక రేంజులో విరుచుకుప‌డింది మ‌ల్లికా శెరావ‌త్. అత‌డు బ్యాడ్ కిస్స‌ర్ అంటూ మ‌ల్లిక చెల‌రేగింది.

By:  Tupaki Desk   |   13 April 2024 12:30 AM GMT
20 ఏళ్ల వైరానికి ముగింపు ప‌లికిన జంట‌
X

సీరియ‌ల్ కిస్స‌ర్ ఇమ్రాన్ హష్మీ - మల్లికా షెరావత్ 2004 ఎరోటిక్ థ్రిల్లర్ `మర్డర్`లో జంట‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే సెట్స్‌లో ఏం తేడా కొట్టిందో కానీ హష్మిపై ఒక రేంజులో విరుచుకుప‌డింది మ‌ల్లికా శెరావ‌త్. అత‌డు బ్యాడ్ కిస్స‌ర్ అంటూ మ‌ల్లిక చెల‌రేగింది. ఈ ఫైటింగ్ అయిన‌ 20 సంవత్సరాల తరువాత చివరకు వారి వైరాన్ని వ‌దిలిపెట్టారు. గురువారం రాత్రి ముంబైలో జరిగిన సినీ నిర్మాత ఆనంద్ పండిట్ కుమార్తె వివాహ రిసెప్షన్‌లో ఇమ్రాన్- మల్లిక తిరిగి కలుసుకున్నారు. రెడ్ కార్పెట్‌పై `ఐకానిక్ ఆన్‌స్క్రీన్ పెయిర్`ని చూడటానికి అభిమానులు చాలా హ్యాపీ ఫీల‌వ్వ‌డం క‌నిపించింది.

ఇమ్రాన్ - మల్లిక జంట ఈ వేదిక‌పై ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకోవడంతో పాటు రెడ్ కార్పెట్‌పై స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ల‌ కోసం పోజులిస్తూ నవ్వుతూ క‌నిపించారు. మల్లిక పింక్ గౌనులో నెక్‌లైన్‌తో అద్బుతంగా కనిపించగా, ఇమ్రాన్ బ్లాక్ సూట్ ధరించాడు. వైరల్ భయానీ షేర్ చేసిన వీడియోలో ఫోటోగ్రాఫ‌ర్ల ముందు ఇమ్రాన్ - మల్లికా సిగ్గుపడటం ఆపలేకపోయారు. ఈ జంట‌పై ఒక అభిమాని ఇలా వ్యాఖ్యానించాడు. ``ఆమె చాలా అద్భుతంగా ఉంది! ఆమె పాట మాయ మాయ అని నేను ఇప్పటికీ అనుకుంటున్నాను! అత్యుత్తమ ఐటెమ్ సాంగ్స్‌లో ఒకటి! ఆమె ఎందుకు అంత తక్కువగా అంచనా వేయబడింది? `` అని రాయ‌గా.. మరొకరు ఇలా రాసారు. ``హాట్నెస్ ఇక్కడ నుండి ప్రారంభమైంది అని వ్యాఖ్యానించాడు.

ఇమ్రాన్, మల్లిక జంటగా నటించిన `మర్డర్` 20 ఏళ్ల క్రితం విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అయితే వీరిద్దరూ సెట్‌లో గొడ‌వ ప‌డ్డాక ప‌రిస్థితులు మారాయి 2021లో ఒక ఇంటర్వ్యూలో మల్లిక మర్డర్ సెట్స్‌లో ఇమ్రాన్‌తో తన ఫైటింగ్ గురించి గుర్తుచేసుకుంది. తాము ఒకరితో ఒకరు మాట్లాడుకోవ‌డంలేదని తెలిపింది. హోస్ట్ మందిరా బేడీ సహ-నటులతో తన పోరాటాల గురించి ప్ర‌శ్నించ‌గా మల్లిక గుర్తుచేసుకున్నారు. మ‌ర్డ‌ర్ తర్వాత లేదా అనంత‌ర కాలంలో ఇమ్రాన్ హష్మీతో చాలా హాస్యాస్పదమైన ఫైట్ అది. మేము మాట్లాడుకోలేదు.. ఇప్పుడు నేను చాలా చిన్నతనంగా భావిస్తున్నాను. సినిమా తర్వాత ప్రమోషన్స్‌లో ఏదో పొరపాటు జరిగిందని అనుకుంటున్నాను. ఎవ‌రూ ఎవ‌రినీ పిల‌వ‌లేదు. నా వైపు కూడా చాలా చిన్నతనం ఉంది. నేనేమీ పంతంలో తక్కువ తినలేదు! అని మల్లిక ఇప్పుడు నాటి ఫైట్ ఎపిసోడ్ గురించి వ్యాఖ్యానించింది. తాము టచ్‌లో లేమ‌ని కూడా మ‌ల్లిక తెలిపారు.

2014లో ఇమ్రాన్ హష్మీ `కాఫీ విత్ కరణ్` చాట్ షోలో మల్లికాపై వివాదాస్పద వ్యాఖ్య‌లు చేశాడు. హోస్ట్ కరణ్ జోహార్ అతడిని స్క్రీన్‌పై ఉత్తమమైన చెత్త ముద్దుల పేర్లు చెప్పమని అడిగాడు. ఆశ్చర్యకరంగా ఇమ్రాన్ తనకు ``తెరపై చెత్త ముద్దు`` తన మర్డర్ సహనటి మల్లికతో ఉందని చెప్పాడు. అయితే అతడు `మర్డర్ 2`లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో లిప్ లాక్ ను మంచి ముద్దుగా కాంప్లిమెంట్ ఇచ్చాడు. మ‌లైకాపై అయిష్ఠ‌త‌ను వ్య‌క్తం చేస్తూ జాక్వెలిన్ ని పొగిడేశాడు గురుడు!