Begin typing your search above and press return to search.

టాలీవుడ్ హీరో.. బాలీవుడ్ విలన్..!

బాలీవుడ్ ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మి ఇప్పటితరం ఆడియన్స్ అంతగా గుర్తించకపోవచ్చు కానీ ఒక 15 ఏళ్ల క్రితం అతను బాలీవుడ్ ని షేక్ చేశాడు.

By:  Tupaki Desk   |   7 Feb 2024 5:40 AM GMT
టాలీవుడ్ హీరో.. బాలీవుడ్ విలన్..!
X

పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటుతున్న టాలీవుడ్ సినిమాల మీద బాలీవుడ్ నటులు ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా ఆఫర్ ఇచ్చినా కాదన్న హిందీ తారలు సైతం ఇప్పుడు ఇక్కడ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే యానిమల్ హిట్ తర్వాత బాబీ డియోల్ కి వరుస ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులో ఆయన రెండు సినిమాలకు సైన్ చేశారు. ఇక లేటెస్ట్ గా మరో బాలీవుడ్ స్టార్ తెలుగు సినిమాల్లో వరుస ఆఫర్లు అందుకుంటున్నారు.

బాలీవుడ్ ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మి ఇప్పటితరం ఆడియన్స్ అంతగా గుర్తించకపోవచ్చు కానీ ఒక 15 ఏళ్ల క్రితం అతను బాలీవుడ్ ని షేక్ చేశాడు. అడల్ట్ కంటెంట్ తో సినిమాలు చేస్తూ అప్పటి యూత్ ని బీభత్సంగా ఆకట్టుకున్న ఇమ్రాన్ హష్మి ఆ తర్వాత దూకుడు తగ్గించాడు. ప్రస్తుతం సుజిత్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాలో ఇమ్రాన్ హష్మి నటిస్తున్నాడు. ఈ సినిమాలో విలన్ రోల్ లో ఇమ్రాన్ అదరగొట్టేస్తాడని అంటున్నారు.

OGలో విలన్ గా చేస్తున్న ఇమ్రాన్ హష్మికి లేటెస్ట్ గా మరో టాలీవుడ్ ఆఫర్ అందిందని తెలుస్తుంది. టాలెంటెడ్ హీరో అడివి శేష్ లీడ్ రోల్ లో సూపర్ హిట్ మూవీ గూఢచారికి సీక్వెల్ గా వస్తున్న గూఢచారి 2లో ఇమ్రాన్ హష్మిని సెలెక్ట్ చేశారట. సినిమాలో విలన్ గా ఇమ్రాన్ హష్మి నటిస్తాడని తెలుస్తుంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో టీజీ విశ్వ ప్రసాద్ అభిషేక్ అగర్వాల్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాను వినయ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాలో హీరోయిన్ గా బనితా సందు నటిస్తుంది. 2018 లో గూఢచారి సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత గూఢచారి సీక్వెల్ చేయాలని అడివి శేష్ అనుకున్నా నాలుగేళ్ల తర్వాత ఈ సినిమా ఇప్పటికి కురింది. గూఢచారి 2 అసలు సిసలైన స్పై థ్రిల్లర్ గా ఆడియన్స్ ని మెప్పిస్తుందని అంటున్నారు.

టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ విలన్లు ఈ ట్రెండ్ ఏదో బాగుందనిపిస్తుంది. బాలీవుడ్ నటులు బాబీ డియో, ఇమ్రాన్ హష్మి ఈ ఇద్దరు ఒకప్పుడు బాలీవుడ్ లో హీరోలుగా సినిమాలు చేశారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో విలన్ రోల్స్ చేస్తున్నారు. ఒకప్పుడు చిన్నగా చూసిన టాలీవుడ్ సంచలన విజయాలతో దూసుకెళ్లడం బాలీవుడ్ వాళ్లకి సైతం నిద్ర పట్టకుండా చేస్తుందని తెలిసిందే.