సీరియల్ కిస్సర్ రూటు మారిన ఫలితం
సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మి తన బ్రాండ్‌ని వదిలేస్తే కష్టమేనని ప్రూవ్ అయింది. అతడు మర్డర్, మర్డర్ 2, డర్టీపిక్చర్ లాంటి మసాలా సినిమాల్లో నటిస్తే ఉండే మజానే వేరు!
By: Tupaki Desk | 27 April 2025 4:41 PMసీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మి తన బ్రాండ్‌ని వదిలేస్తే కష్టమేనని ప్రూవ్ అయింది. అతడు మర్డర్, మర్డర్ 2, డర్టీపిక్చర్ లాంటి మసాలా సినిమాల్లో నటిస్తే ఉండే మజానే వేరు! అలాంటి కమర్షియల్ మసాలా చిత్రాలను ఆదరించేందుకు మాస్ ఎప్పుడూ వెనకాడరు. కథానాయికలతో ఘాటైన చుంబనాలు, బెడ్ రూమ్ సన్నివేశాల్లో మాత్రమే అతడిని చూడగలరని తాజాగా రిలీజైన `గ్రౌండ్ జీరో` ప్రూవ్ చేసింది.
అతడు జానర్ మార్చితే కష్టం. ఇప్పుడు దేశభక్తుడిగా, విరోచితంగా పోరాడే సైనికుడిగా కనిపించాలని అతడు భ్రమపడ్డాడని కూడా `గ్రౌండ్ జీరో` సినిమా చూసిన క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు. ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ కాంబినేషన్ లో రూపొందించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. విడుదలకు ముందు ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించింది. కానీ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన వసూళ్లను తేవడంలో విఫలమైంది. మొదటిరోజు రూ. 1.15 - 1.20 కోట్లు, రెండవ రోజు దాదాపు రూ. 1.50 -1.90 కోట్ల మధ్య వసూలు చేసింది. 2 రోజుల్లో ఓవరాల్ గా 3 కోట్లు మించలేదు. ఇది నిరాశాజనకమైన ఫలితం.
నిజానికి జన్నత్, మర్డర్, డర్టీ పిక్చర్ లాంటి సినిమాలు తొలి వీకెండ్ భారీ హైప్ తో మాస్ ని థియేటర్లకు రప్పించడంతో భారీ విజయాన్ని సాధించాయి. కానీ అందుకు భిన్నంగా దేశభక్తి సినిమా `గ్రౌండ్ జీరో` వసూళ్లు చాలా తీసికట్టుగా కనిపించాయి. పోటీబరిలో గోపిచంద్ మలినేని - సన్నీడియోల్ కాంబినేషన్ మూవీ జాత్ చక్కని వసూళ్లను సాధిస్తోంది. అక్షయ్ కేసరి చాప్టర్ 2 పాజిటివ్ టాక్ తో ఫర్వాలేదనిపించే వసూళ్లతో నడుస్తోంది. కానీ ఇమ్రాన్ హష్మి గ్రౌండ్ జీరో ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ అందుకుని కూడా తొలి వీకెండ్ ఆశించిన వసూళ్లను సాధించకపోవడం నిరాశపరిచింది. థియేటర్ ఆక్యుపెన్సీ మరీ ఘోరంగా 15శాతం లోపు ఉందని ట్రేడ్ చెబుతోంది. ఇది ఊహించని రిజల్ట్. దీనిని బట్టి ఇమ్రాన్ హష్మి తదుపరి మర్డర్ ఫ్రాంఛైజీలో కొత్త సినిమా చేస్తే యూత్ లో హుషారు పెంచగలడేమో!