ఆర్తికి జయం రవి ప్రేయసి కౌంటర్
పచ్చని కాపురంలో నిప్పులు పోశావంటూ సింగర్ కెనీషాపై తమిళ తంబీలు, నెటిజన్‌లు విరుచుకుపడుతున్నారు.
By: Tupaki Desk | 13 May 2025 2:12 PMతమిళ హీరో జయం రవికి గాయని కెనీషా రిలేషన్ షిప్‌లో ఉన్నారని గత కొంత కాలంగా కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. తన కారణంగానే భార్య ఆర్తితో జయం రవి విడిపోవాలనే నిర్ణయానికి వచ్చాడని, 18 ఏళ్ల వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ భార్య ఆర్తికి విడాకులు ఇస్తున్నారని తమిళ ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకున్నాయి. అయితే ఆ వాదనకు బలం చేకూరుస్తూ భార్య ఆర్తీతో విడాకులు తీసుకుంటున్నానని జయం రవి ప్రకటించి షాక్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
కోలీవుడ్‌లో బెస్ట్ కపుల్‌లో ఓ జంటగా పేరు తెచ్చుకున్న జయం రవి- ఆర్తి అనూహ్యంగా విడిపోవడానికి సిద్ధపడటం కోలీవుడ్ వర్గాలని, ప్రేక్షకుల్ని నిజంగానే షాక్‌కు గురి చేసింది. ఎడిటర్ మోహన్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన రవి 'జయం' రీమేక్‌తో ఆ పేరునే ఇంటి పేరుగా మార్చుకుని తమిళనాట పాపులర్ అయ్యారు. ఈ ఏడాది 'కదలిక్కనేరమిల్లై' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన జయం రవి ప్రస్తుతం మరో మూడు సినిమాల్లో నటిస్తున్నాడు.
అంతే కాకుండా వచ్చే ఏడాది తనిఒరువన్ సీక్వెల్‌తో రాబోతున్నాడు. ఇదిలా ఉంటే జయం రవి తన భార్య ఆర్తితో విడిపోవాలని నిర్ణయించుకుని విడాకులకు అప్లై చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణలో ఉంది. ఈ నేపథ్యంలోనే జయం రవి సింగర్, రూమర్డ్ గాళ్ ఫ్రెండ్ కెనీషాతో బయట తిరిగేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫొటొలు వైరల్ కావడంతో ఆర్తి స్పందించింది. సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ నోట్‌ని షేర్ చేసింది.
దీంతో కెనీషా మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. పచ్చని కాపురంలో నిప్పులు పోశావంటూ సింగర్ కెనీషాపై తమిళ తంబీలు, నెటిజన్‌లు విరుచుకుపడుతున్నారు. దీనికి ఏమాత్రం భయపడని కెనీషా గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆర్తి తను ఏదైనా చెప్పాలనుకుంటే నేనుగా తనతో మాట్లాడాలని, పీఆర్‌ని పెట్టుకుని తనపై బురదజల్లడం ఆపాలని కౌంటర్ ఇచ్చింది. దీనిపై ఆర్తి ఇప్పటి వరకు కౌంటర్ ఇవ్వకపోవడం గమనార్హం.