Begin typing your search above and press return to search.

న‌టి లైసెన్స్ 6నెల‌ల పాటు నిషేధం

హ్యారీ పాటర్ ఫేం, నటి ఎమ్మా వాట్సన్ స‌హ తార‌ల‌తో డేటింగ్ కార‌ణంగా వార్త‌ల్లో నిలిచేది. ఇప్ప‌టికి న‌లుగురితో ఎమ్మా డేటింగ్ చేసిందంటూ క‌థ‌నాలొచ్చాయి.

By:  Tupaki Desk   |   18 July 2025 9:00 AM IST
న‌టి లైసెన్స్ 6నెల‌ల పాటు నిషేధం
X

హ్యారీ పాటర్ ఫేం, నటి ఎమ్మా వాట్సన్ స‌హ తార‌ల‌తో డేటింగ్ కార‌ణంగా వార్త‌ల్లో నిలిచేది. ఇప్ప‌టికి న‌లుగురితో ఎమ్మా డేటింగ్ చేసిందంటూ క‌థ‌నాలొచ్చాయి. ఇప్పుడు ఒక కొత్త‌ కార‌ణంతో మీడియా హెడ్ లైన్స్ లో కొచ్చింది. ఎమ్మా వేగంగా వాహనం నడుపుతూ దొరికినందుకు ఆరు నెలల పాటు డ్రైవింగ్ చేయకుండా నిషేధానికి గురైంది. ప్ర‌ఖ్యాత బీబీసీ క‌థ‌నం ప్ర‌కారం... ఎమ్మా అతి వేగంగా కార్ డ్రైవ్ చేసినందుకు హై వైకోంబ్ మేజిస్ట్రేట్ కోర్టులో మొత్తం 1,044 పౌండ్లు జ‌రిమానా చెల్లించాల్సి వచ్చింది.

గత సంవత్సరం జూలైలో ఆక్స్‌ఫర్డ్‌లోని గంట‌కు 30 కి.మీ స్పీడ్ తో వాహ‌నం నడపాల్సిన జోన్‌లో ఎమ్మా 38 కి.మీ ల‌ వేగంతో నీలిరంగు ఆడి కార్‌ నడిపిందని తెలుస్తోంది. ఎమ్మా లైసెన్స్‌లో తొమ్మిది పాయింట్లు ఉండ‌గా, ఈ అతివేగం కొంప ముంచింది. హై వైకోంబ్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణకు గ‌తంలో ఎమ్మా హాజరు కాలేదు. ఆమె తరపున ప్రతినిధులు హాజరయ్యారు. అయితే ఎమ్మా ఒక విద్యార్థిని అని, త‌ప్పున‌కు ఫైన్ క‌డుతుంద‌ని ఆమె త‌ర‌పు న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. 35 ఏళ్ల ఎమ్మా త‌న‌కు చ‌దువుపై ఉన్న మ‌క్కువ కార‌ణంగా 2023 నుండి ఆక్స్‌ఫర్డ్‌లో చేరింది. అక్క‌డ‌ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో చేరింది.

సినిమా రంగంలో కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఈ ఏడాది కేన్స్ ఫిలింఫెస్టివ‌ల్‌కి అటెండ్ అయింది. 12 సంవత్సరాల గైర్హాజరీ తర్వాత ఇంత‌కాలానికి ఆ కార్యక్రమానికి వచ్చింది. గ్రెటా గెర్విగ్ `లిటిల్ ఉమెన్‌`లో ముఖ్యమైన పాత్ర పోషించిన ఎమ్మా ఈ ఉత్సవాల‌కు అధికారికంగా హాజ‌రైంది. ఎమ్మా న‌ట‌న‌ను విర‌మించి చాలా సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ కోసం చురుకుగా పనిచేస్తోంది. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగిన 2021 ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు సమావేశంలో ఎమ్మా వాతావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌తో వాతావరణ మార్పుపై ఒక ప్యానెల్‌ను నిర్వహించింది.