ప్రాణాల గుప్పెట్లో కళ్యాణ్ రామ్ హీరోయిన్.. చంపేస్తారంటూ..
ఇరానియన్ బ్యూటీ ఎల్నాజ్ నొరౌజీ 'సేక్రేడ్ గేమ్స్' వెబ్ సిరీస్‌తో భారతీయుల మనసు గెలుచుకున్నారు.
By: Madhu Reddy | 3 March 2026 2:09 PM ISTఇరానియన్ బ్యూటీ ఎల్నాజ్ నొరౌజీ 'సేక్రేడ్ గేమ్స్' వెబ్ సిరీస్‌తో భారతీయుల మనసు గెలుచుకున్నారు. ఐతే ఇప్పుడు ప్రాణభయంతో ఆమె వణికిపోతోంది. గెరార్డ్ బట్లర్ వంటి హాలీవుడ్ స్టార్‌తో నటించి, తెలుగులో 'డెవిల్' సినిమాతో మెప్పించిన ఈమె, తన సొంత దేశం ఇరాన్‌కు వెళ్లలేనని తెగేసి చెబుతోంది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ మృతిపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. అక్కడ అడుగుపెడితే తనను చంపేస్తారంటూ ఆమె చేసిన షాకింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు చూద్దాం ..
సొంత దేశానికే వెళ్లలేని పరిస్థితి.. ఎందుకు:
ఎల్నాజ్ నొరౌజీ కేవలం ఎనిమిదేళ్ల వయసులోనే ఇరాన్ విడిచి ఐరోపాకు వెళ్లిపోయింది. అక్కడ మోడలింగ్‌లో రాణించి, భారత్‌కు వచ్చి హీరోయిన్‌గా ఎదిగింది. అయితే, తన దేశంలోని ప్రస్తుత ప్రభుత్వంపై ఆమె ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే ఉంది. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణ వార్త విన్న తర్వాత ఆమె బహిరంగంగా సెలబ్రేషన్స్ చేసుకోవడం ఇరాన్ వాళ్లకు కోపం తెప్పించింది. ఇక ప్రస్తుత ప్రభుత్వం దిగిపోయే వరకు తాను ఇరాన్‌లో అడుగుపెట్టలేనని, పొరపాటున వెళ్తే తనను ప్రాణాలతో వదిలిపెట్టరని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రాణాల మీద ఆశ ఉంటే అక్కడికి వెళ్లకపోవడమే మంచిదని ఆమె భావిస్తోంది.
గ్లామర్ వెనుక ఉన్న పోరాటం:
తెలుగులో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 'డెవిల్' సినిమాలో ఎల్నాజ్ ఒక కీలక పాత్రలో కనిపించడమే కాకుండా, తన అద్భుతమైన లుక్స్‌తో స్పెషల్ సాంగ్‌లో దుమ్మురేపింది. ఆ పాట అప్పట్లో యూత్ మధ్య తెగ వైరల్ అయింది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, 'కాందహార్' వంటి హాలీవుడ్ చిత్రంలో గెరార్డ్ బట్లర్‌తో కలిసి నటించి తన సత్తా చాటింది. అయితే ఎంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చినా, తన దేశంలోని మహిళల హక్కుల కోసం ఆమె గొంతు ఎత్తుతూనే ఉంది. హిజాబ్ వ్యతిరేక పోరాటాలకు మద్దతుగా నిలిచినందుకు ఇప్పటికే ఆమెను ఇరాన్ ప్రభుత్వ బహిష్కరణ చేసినట్టు సమాచారం. మరి భవిష్యత్తులో ఇరాన్‌లో పరిస్థితులు మారి ఎల్నాజ్ మళ్లీ తన సొంత ఊరికి వెళ్తుందో లేదో వేచి చూడాలి.
ఇక ప్రస్తుతం ఎల్నాజ్ ఇండియాలోనే ఉంటూ తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఇక్కడ తనకు లభిస్తున్న గౌరవం, భద్రత ఇరాన్‌లో లేవని ఆమె అంటోంది. తన గతాన్ని, తన దేశాన్ని ఎంతగా ప్రేమించినా, అక్కడి కఠిన నిబంధనలు మరియు రాజకీయ పరిస్థితులు తనను శత్రువులా చూస్తున్నాయని ఆమె వాపోతోంది. "ఒక నటిగా నేను స్వేచ్ఛను కోరుకుంటాను, కానీ నా దేశంలో ఆ స్వేచ్ఛకు తావులేదు" అని ఆమె కుండబద్దలు కొట్టి చెబుతోంది. ఇరాన్ ప్రభుత్వం మారి, ప్రజాస్వామ్యం వచ్చే వరకు తన నివాసం ఇండియానే అని ఆమె స్పష్టం చేసింది.
