నా ఫ్రెండుతో చీట్ గేమ్ ఆడాడు.. నటి ఆవేదన!
ప్రేమ, పెళ్లి అనేవి నమ్మకం అనే ఎమోషన్ పై ఆధారపడి ఉంటాయి. కానీ ఈ నమ్మకం అపనమ్మకంగా మారినప్పుడు పరిణామాలు తీవ్రంగా మారతాయి.
By: Tupaki Desk | 27 Jun 2025 10:00 PM ISTప్రేమ, పెళ్లి అనేవి నమ్మకం అనే ఎమోషన్ పై ఆధారపడి ఉంటాయి. కానీ ఈ నమ్మకం అపనమ్మకంగా మారినప్పుడు పరిణామాలు తీవ్రంగా మారతాయి. అలాంటి ఒక అప నమ్మకానికి కారణం ఆ ఇద్దరి మధ్యా తలదూర్చే మరో మహిళ కావొచ్చు.
ఈ ఎపిసోడ్ లో అతడు ఆమె గొప్ప ప్రేమికులు. కానీ మధ్యలో ఆమె ఫ్రెండు కూడా సీన్ లోకి వచ్చింది. అయితే తనతో ఉంటూనే, తన ఫ్రెండుతోను అతడు రిలేషన్ షిప్ మెయింటెయిన్ చేసి చీట్ చేసాడని సదరు నటీమణి వాపోయింది. ఈ ఎపిసోడ్ లో ఆ నటి పేరు ఎల్నాజ్ నొరౌజీ. ఈ నటి తన భాగస్వామి చేసిన ద్రోహాన్ని బయటపెట్టింది. ఆ 4 సంవత్సరాలు అతడు నా ప్రాణ స్నేహితురాలితో కూడా రిలేషన్‌లో ఉన్నాడు అని తెలిపింది.
కరణ్ జోహార్ `ది ట్రెయిటర్స్`లో నటించింది ఎల్నాజ్ నొరౌజీ. తనకు జరిగిన ద్రోహం గురించి ఈ నటీమణి ఓపెనైంది. ఇరాన్- టెహ్రాన్‌లో జన్మించిన నౌరోజీ 14 సంవత్సరాల వయస్సులో మోడలింగ్ ప్రారంభించింది. సేక్రెడ్ గేమ్స్ సహా పలు హిందీ చిత్రాల్లో నౌరోజీ నటించింది. `కాందహార్` అనే చిత్రంతో తన హాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఇప్పుడు ఓటీటీ సిరీస్ ది ట్రెయిలర్ లో కనిపించనుంది. కరణ్ హోస్ట్ చేస్తున్న షోలో ఎల్నాజ్ నౌరోజి తనకు ఎదురైన ద్రోహం గురించి ఓపెనైంది. నాలుగేళ్లుగా డేటింగ్ లో ఉండగా, అతడు నా స్నేహితురాలితోను డేట్ చేసాడు అని తెలిసిందని ఆవేదన చెందింది. అతడు నా ప్రాణ స్నేహితుడితో కూడా ఉన్నాడని నాకు తెలిసింది. తరువాత నాకు సందేశాలు, ఇమెయిల్‌లు, ఫోటోలు ప్రతిదీ దొరికాయి. అదే నా జీవితంలో అతిపెద్ద ద్రోహం... అని తెలిపింది.
ఇరాన్ టెహ్రాన్‌లో పుట్టి జర్మనీలో పెరిగిన ఎల్నాజ్ తన మోడలింగ్ కెరీర్‌ను 14 సంవత్సరాల వయస్సులో ప్రారంభించింది. 2018లో పాకిస్తానీ చిత్రం `మాన్ జావో నా`లో నటించాక, పంజాబీ చిత్రం `ఖిడో ఖుండి`తో తన నటనా రంగ ప్రవేశం చేసింది. హిందీ, ఉర్దూ, పంజాబీ, జర్మన్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, పర్షియన్ వంటి బహుళ భాషలలో నిష్ణాతురాలు అయిన ఎల్నాజ్ 2022లో లా లా లవ్ అనే సింగిల్ తో తన అరంగేట్రం చేసి గాయనిగాను అడుగుపెట్టింది. శాక్రెడ్ గేమ్స్, హలో చార్లీ, జగ్‌జగ్ జీయో వంటి చిత్రాల్లో నటించింది. 2023లో 300నటుడు గెరార్డ్ బట్లర్ సరసన కాందహార్`తో హాలీవుడ్‌లో అడుగుపెట్టింది. హాలీవుడ్ చిత్రం `హోటల్ టెహ్రాన్`లోను కథానాయికగా నటించగా ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
