Begin typing your search above and press return to search.

#డెవిల్‌.. లేడీ రోజీ గుండెల్లోకి దూసుకొస్తోంది

తాజాగా ఎల్నాజ్ లుక్ కి సంబంధించిన వీడియో గ్లింప్స్, ఫోటోల‌ను చిత్ర‌బృందం షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారుతున్నాయి. ఎల్నాజ్ రోజీ వేడెక్కించే లుక్ కి యూత్ లో అద్భుత స్పంద‌న వ‌స్తోంది.

By:  Tupaki Desk   |   28 Dec 2023 11:03 AM GMT
#డెవిల్‌.. లేడీ రోజీ గుండెల్లోకి దూసుకొస్తోంది
X

నందమూరి కళ్యాణ్‌రామ్ తన విలక్షణమైన క‌థా ఎంపిక‌ల‌తో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటారు. అతడి తాజా ప్రాజెక్ట్ డెవిల్ టైటిల్ ప్ర‌క‌ట‌న ద‌శ నుంచి క్యూరియాసిటీ పెంచింది. అభిషేక్ నామా దర్శకత్వం వహించి, నిర్మించిన ఈ చిత్రానికి 'ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్' అనే ట్యాగ్‌లైన్ ని ఎంపిక చేసారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైల‌ర్ ఆక‌ట్టుకున్నాయి. ఈ శుక్ర‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా డెవిల్ విడుద‌ల‌వుతోంది.


ఈ చిత్రంలో సంయుక్త‌, మాళవిక నాయర్‌ సహా ప్రతిభావంతులైన తారాగణం న‌టించారు. ఇందులోనే రోజీ పాత్రతో బాలీవుడ్ సిజ్లింగ్ సెన్సేషన్ ఎల్నాజ్ నొరౌజీ గుబులు పుట్టించ‌బోతోంది. తాజాగా ఎల్నాజ్ లుక్ కి సంబంధించిన వీడియో గ్లింప్స్, ఫోటోల‌ను చిత్ర‌బృందం షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారుతున్నాయి. ఎల్నాజ్ రోజీ వేడెక్కించే లుక్ కి యూత్ లో అద్భుత స్పంద‌న వ‌స్తోంది. బాలీవుడ్ బ్యూటీ ఎల్నాజ్ నొరౌజీ తన అద్భుతమైన నృత్య కదలికలతో డ్యాన్స్ ఫ్లోర్‌ను మండించడం ఖాయ‌మ‌ని ఈ వీడియో చెబుతోంది.


ఈ ఆనంద స‌మ‌యంలో ''లేడీ రోజీ రేపు సినిమాల్లోకి రాబోతోంది.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నా మొట్టమొదటి పాట.. ప్రత్యేక ప్రదర్శన కోసం చాలా సంతోషిస్తున్నాను!'' అని ఎల్నాజ్ ఇన్ స్టాలో వ్యాఖ్య‌ను జోడించారు. మెరిసే వెండి దుస్తులలో ఎల్నాజ్ ఆకర్షణీయమైన రూపం .. న‌య‌గారాల వంటి వంపుసొంపుల వ‌య్యారాల వ‌డ్డ‌న కిక్కు పెంచుతోంది.


ఎల్నాజ్ ఇదివ‌ర‌కూ సేక్రెడ్ గేమ్స్ -అభయ్ -పంజాబీ చిత్రం ఖిడో ఖుండి, హలో చార్లీ వంటి చిత్రాల్లో న‌టించింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి అగ్ర హీరోలతో పాటు యాడ్ కమర్షియల్‌లలో కూడా నటించింది. అనేక మ్యూజిక్ వీడియోలలో కనిపించింది.


డెవిల్ చిత్రానికి సౌందర్ రాజన్ ఎస్ సినిమాటోగ్రఫీని అందిస్తుండగా.. కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలను శ్రీకాంత్ విస్సా అందించారు. తమ్మిరాజు ఎడిటింగ్ వ‌ర్క్ అందించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ పాట‌ల్ని స్వరపరిచారు.