Begin typing your search above and press return to search.

గ్లామర్ తో హీటేక్కిస్తున్న డెవిల్ బ్యూటీ

ఈమె క్యారెక్టర్ కి సంబందించిన ఫస్ట్ లుక్ ని తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఇల్నాజ్ హాట్ గా కనిపిస్తూ ఉండటం విశేషం.

By:  Tupaki Desk   |   21 Oct 2023 10:02 AM GMT
గ్లామర్ తో హీటేక్కిస్తున్న డెవిల్ బ్యూటీ
X

ఇరాన్ కి చెందిన ఇండియన్ మోడల్, యాక్టర్ ఇల్నాజ్ నోరంజీ గురించి బాలీవుడ్ లో ఎక్కువ మందికి తెలుసు. సాక్రేడ్ గేమ్స్ మూవీస్ తో ఈ బ్యూటీ నటిగా కెరియర్ స్టార్ట్ చేసింది. వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఓ వైపు మోడల్ గా రానిస్తూనే వెబ్ సిరీస్, హిందీ సినిమాలలో నటిగా కెరియర్ బిల్డ్ చేసుకునే పనిలో ఉంది.


ఈ బ్యూటీకి బాలీవుడ్ లో మంచి పేరుంది. ప్రస్తుతం ఈ ఇరానియన్ బ్యూటీ నటిగా టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న డెవిల్ మూవీలో రోజీ అనే పాత్రలో ఈ బ్యూటీ నటిస్తోంది. గ్లామర్ క్వీన్ గా బ్రిటిష్ విమెన్ గా ఆమె పాత్ర డెవిల్ సినిమాలో ఉండబోతోందని తెలుస్తోంది.

ఈమె క్యారెక్టర్ కి సంబందించిన ఫస్ట్ లుక్ ని తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఇల్నాజ్ హాట్ గా కనిపిస్తూ ఉండటం విశేషం. పబ్ నేపథ్యంలో బార్ గర్ల్ గెటప్ లో ఆమె ఆహార్యం ఉంది. సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందని ఫస్ట్ లుక్ పోస్టర్ బట్టి తెలుస్తోంది.

డెవిల్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోంది. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి కథ అందిస్తూ ఉండటం విశేషం. నవంబర్ 24న ఈ మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన టీజర్ అందరికి భాగా కనెక్ట్ అయ్యింది. సినిమాలో కళ్యాణ్ రామ్ రోల్ బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ లో పనిచేసే సీక్రెట్ ఏజెంట్ గా ఉండబోతోంది.

సంయుక్త మీనన్ ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ కి జోడీగా నటిస్తోంది. బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ నుంచి రాబోతోనున్న భారీ బడ్జెట్ చిత్రం ఇదే కావడం విశేషం. మధ్యలో అమిగోస్ మూవీ రిలీజ్ అయిన బడ్జెట్ పరంగా డెవిల్ కంటే తక్కువే అని చెప్పాలి.