Begin typing your search above and press return to search.

బెడ్ రూమ్‌లో ఎల్లీ అవ్‌రామ్ చిలిపిత‌నం

ఉత్త‌రాదిన బుల్లితెర వీక్ష‌కుల‌కు ఎల్లీ అవ్ రామ్ నిరంత‌రం ట్రీటిస్తోంది. టెలివిజ‌న్ రియాలిటీ షోల‌తో బిజీగా ఉన్న ఎల్లీ అవ్ రామ్ ఇటీవ‌లే ఓ సింగిల్ ఆల్బ‌మ్ లోను న‌టించింది.

By:  Tupaki Desk   |   22 July 2025 9:54 AM IST
బెడ్ రూమ్‌లో ఎల్లీ అవ్‌రామ్ చిలిపిత‌నం
X

ఉత్త‌రాదిన బుల్లితెర వీక్ష‌కుల‌కు ఎల్లీ అవ్ రామ్ నిరంత‌రం ట్రీటిస్తోంది. టెలివిజ‌న్ రియాలిటీ షోల‌తో బిజీగా ఉన్న ఎల్లీ అవ్ రామ్ ఇటీవ‌లే ఓ సింగిల్ ఆల్బ‌మ్ లోను న‌టించింది. ఇంత‌లోనే ఎల్లీ త‌న సోష‌ల్ మీడియా ఫ్యాన్స్ కోసం స్పెష‌ల్ ఫోటోషూట్‌తో దూసుకొచ్చింది. ఈ ఫోటోషూట్ సంథింగ్ స్పెష‌ల్ అనేంత‌గా అద్భుత‌మైన ఎక్స్ ప్రెష‌న్స్ తో ఎల్లీ క‌ట్టిప‌డేసింది. ఇది ఆహ్లాద‌క‌ర‌మైన బెడ్ రూమ్ లో అవ్ రామ్ స్మైలీ రూపాన్ని ఎలివేట్ చేసిన ఫోటోషూట్. ప‌డ‌క గ‌దిలో బెడ్ పై ఎల్లీ ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ఫోజులిచ్చింది. స్మైలిస్తూ, చిలిపిగా అల్ల‌రిగా, కొంటెగా ర‌కర‌కాలుగా ముఖ క‌వ‌లిక‌ల్ని మారుస్తూ ఫోటోల‌కు ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది. చిలిపి అల్ల‌రి ఎల్లీ మ‌న‌సులు గెలుచుకుంది అంటూ అభిమానులు ఈ ఫోటోషూట్ ని ప్ర‌శంసిస్తున్నారు. త‌న తాజా ఆల్బ‌మ్ `చందానియా..` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న ఎల్లీ ఇలా ఫోటోషూట్ల‌తోను అభిమానుల‌కు స్పెష‌ల్ ట్రీటిస్తోంది.


యూట్యూబ‌ర్ ప్రేమ‌లో?


ప్రముఖ యూట్యూబర్, కంటెంట్ సృష్టికర్త అయిన ఆశిష్ చంచలానీతో ఎల్లీ అవ్ రామ్ ప్రేమ‌లో ఉందంటూ ప్ర‌చారం సాగుతోంది. అత‌డితో ఎల్లీ అత్యంత స‌న్నిహితంగా ఉన్న ఫోటోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయ్యాయి. కానీ ఆ త‌ర్వాత ఈ జంట ఓ సింగిల్ ఆల్బ‌మ్ కోసం క‌లిసి ప‌ని చేసార‌ని తెలిసింది.


ఇంత‌కుముందే ఆశిష్ - ఎల్లీ కలిసి తమ మ్యూజిక్ వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాలో విడుదల చేయగా వారి మ‌ధ్య స్నేహం గురించి నెటిజ‌నుల్లో గుస‌గుస మొద‌లైంది. కానీ ఇది కేవ‌లం వృత్తిగ‌త‌మైన స్నేహం మాత్ర‌మేన‌ని అర్థం చేసుకున్నారు. ఈ జంట న‌టించిన `చందానియా` మాస్టర్ ఆఫ్ మెలోడీ ఆల్బమ్‌లో భాగం. దీనిని విశాల్ మిశ్రా పాడారు, మిథూన్ స్వరపరిచారు. ఈ మ్యూజిక్ వీడియోలో హాస్యం, శృంగారం, డ్రామా ఆక‌ట్టుకున్నాయి. ముఖ్యంగా ఆ ఇద్దరి మధ్య అంద‌మైన కెమిస్ట్రీ యువ‌త‌రాన్ని ఆక‌ర్షించింది. వెనిస్ నేప‌థ్యంలో ఈ పాట‌ను చిత్రీక‌రించారు.