Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఎర్ర కోక‌లో జిల్ల‌నిపించిన ఎల్లీ

ఎల్లి అవ్రామ్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం వేడెక్కించ‌డం ఈ అమ్మ‌డి హ్యాబిట్.

By:  Tupaki Desk   |   29 March 2025 9:23 AM IST
ఫోటో స్టోరి: ఎర్ర కోక‌లో జిల్ల‌నిపించిన ఎల్లీ
X

ఎల్లి అవ్రామ్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం వేడెక్కించ‌డం ఈ అమ్మ‌డి హ్యాబిట్. అంద‌మైన బికినీలు మోనోకినీల్లో ట్రీటిచ్చే ఎల్లీ ఈసారి ప‌ద్ధ‌తిగా చీర‌క‌ట్టులో క‌నిపించింది. ఎల్లీ రెడ్ హా* శారీలో ముగ్ధ‌మ‌నోహ‌రిని త‌ల‌పిస్తోంది. ``ది చెర్రీ ఆన్ ది కేక్ లాగా అనిపించింది`` అంటూ ఎల్లీ ఈ ఫోటోషూట్ కి ట్యాగ్ ని ఇచ్చింది. అలాగే మ‌రాఠీ ఇండ‌స్ట్రీలో త‌న తొలి అవార్డును అందుకున్న సంద‌ర్భంగా ఈ భామ ఉబ్బిత‌బ్బిబ్బ‌యింది.

నేను 12 సంవత్సరాల క్రితం బాలీవుడ్ డ్రీమ్‌తో ముంబైకి వెళ్లినప్పుడు, ఒక రోజు నేను మరాఠీ సినిమాలో కూడా నటిస్తానని, మరాఠీలో మాట్లాడతానని, డబ్బింగ్ చెబుతానని, తర్వాత దానికి గుర్తింపు లభిస్తుందని నాకు తెలియదు. చాలా కృతజ్ఞతగా ఉన్నాను అని ఎల్లీ చెప్పింది. ధన్యవాదాలు ముంబై మేరీ జాన్! అని కూడా అభిమానం చాటుకుంది. మరాఠీలో డెబ్యూ న‌టిగా `రేడియో సిటీ ముంబై ఐకానిక్ అవార్డు`కు ఎంపికైనందున‌ కృతజ్ఞతతో ఎల్లీ ఇలా త‌న ఆనందం వ్య‌క్తం చేసింది.

చెర్రీ అంటే ఆనందం .. నేను ఆ చిన్న చిరునవ్వును చూసినప్పుడు వావ్ అనిపిస్తుంది..చాలా అందంగా ఉంది పారో! అంటూ ఒక అభిమాని ఎల్లీపై ప్రేమ‌ను కురిపించాడు. తాజా లుక్ పై వ్యాఖ్యానిస్తూ.. ఎల్లీ చంపుతోంది.. మ‌రిగిస్తోంది! అంటూ ఒక అభిమాని ఒక‌రు దీనిపై వ్యాఖ్యానించారు. మరికొందరు కామెంట్స్ విభాగంలో ఫైర్- హార్ట్ ఎమోజీలను షేర్ చేసారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వేగంగా యువ‌త‌రంలో షేర్ అవుతున్నాయి.

కిస్ కిస్కో ప్యార్ కరూన్, గణపత్, గుడ్ బై, మలంగ్, కోయి జానే నా.. లాంటి చిత్రాల్లో నటించింది ఎల్లీ అవ్‌రామ్. ఆమె సల్మాన్ ఖాన్ వివాదాస్పద రియాలిటీ షో `బిగ్ బాస్ 13`లో కూడా పాల్గొంది. గత సంవత్సరం, ఎల్లి అవ్రామ్ హౌటర్‌ఫ్లైకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కన్యత్వానికి సంబంధించిన విష‌యాల‌ను మాట్లాడి, సినీఇండ‌స్ట్రీలో తన అనుభవాలను గురించి ఓపెనైంది. పరిశ్రమలోని ఒక వ్యక్తిని క‌లిసిన‌ప్పుడు.. అత‌డు త‌న కన్యత్వం గురించి నిర్మొహమాటంగా అడిగిన సంఘటన గురించి ఎల్లీ వెల్ల‌డించింది.

ఎల్లీ విదేశీ వ‌నిత కాబ‌ట్టి త‌న‌తో ప‌డ‌క సుఖం పంచుకోవ‌డం సుల‌భం! అని అత‌డు భావించాడ‌ని కూడా చెప్పింది. ఈ వ్యాఖ్య‌లతో తాను ఎంతగా అవమానానికి గురైందో తెలిపింది. పరిశ్రమలో తన దశాబ్దపు కెరీర్‌లో తాను ఎదుర్కొన్న చాలా విష‌యాల‌ను ఎల్లీ బ‌హిరంగంగా బ‌య‌ట‌పెట్టింది.