Begin typing your search above and press return to search.

చిట్టి పొట్టి దుస్తుల్లో ఎల్లీ అవ్‌రామ్ సెల్ఫీ

స్వీడిష్ బ్యూటీ ఎల్లీ అవ్ రామ్ భార‌త‌దేశంలో త‌న‌దైన గ్లామ‌ర్ షోతో హ‌వా సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   21 May 2025 7:00 AM IST
చిట్టి పొట్టి దుస్తుల్లో ఎల్లీ అవ్‌రామ్ సెల్ఫీ
X

స్వీడిష్ బ్యూటీ ఎల్లీ అవ్ రామ్ భార‌త‌దేశంలో త‌న‌దైన గ్లామ‌ర్ షోతో హ‌వా సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌న‌దైన అందం డ్యాన్సింగ్ నైపుణ్యంతో మెప్పించిన ఈ బ్యూటీ హిందీ చిత్ర‌సీమ‌లో అందివ‌చ్చే ఏ అవ‌కాశాన్ని విడిచిపెట్ట‌దు. స్టేజీ షోలు, బుల్లితెర రియాలిటీ షోల‌తోను బాగానే ఆర్జిస్తోంది.. కెరీర్ ఆరంభం ప‌లు వీడియో ఆల్బ‌మ్స్ లో అద్భుత‌ నర్త‌కిగా పేరు తెచ్చుకుని అటుపై బాలీవుడ్ లోనే క్రేజీ డ్యాన్స‌ర్ల‌లో ఒక‌రిగా పాపుల‌రైంది.

అయితే ఇటీవ‌లి కాలంలో అవ్ రామ్ లో మునుప‌టి దూకుడు క‌నిపించ‌డం లేదు. న‌ట‌నా కెరీర్ ఎలా ఉన్నా కానీ ఫోటోషూట్ల ప‌రంగా ఎల్లీ అవ్ రామ్ ఎప్పుడూ బిజీ బిజీ. సోష‌ల్ మీడియాల్లో ఫోటోషూట్ల‌ను నిరంత‌రం షేర్ చేస్తుంది. తాజాగా ఎల్లీ అవ్ రామ్ బ్లాక్ క‌ల‌ర్ పొట్టి దుస్తుల్లో క‌నిపించింది. త‌న మొబైల్ లో సెల్ఫీలు క్లిక్ చేస్తూ క‌నిపించింది. తీర్చిదిద్దిన అంద‌మైన దేహ‌శిరుల‌పై రెండు బ్లాక్ క‌ల‌ర్ పీస్ లు మాత్ర‌మే హైలైట్ గా క‌నిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది.

ఇటీవ‌ల బాలీవుడ్ లో అవ్ రామ్ స్పీడ్ త‌గ్గింద‌నే చెప్పాలి. కానీ ఓ త‌మిళ చిత్రం లో అవ‌కాశం అందుకుంది. అమితాబ్ బచ్చన్ తో కలిసి గుడ్ బైలో న‌టించింది. పియానో అనే హిందీ- ఇంగ్లీష్ ద్విభాషా చిత్రంలోనూ ఎల్లీ అవ్ రామ్ న‌టిస్తోంది. టైగ‌ర్ ష్రాఫ్ న‌టిస్తున్న‌ గ‌ణ‌ప‌త్ పార్ట్ 1 లో న‌టిస్తోంది. నానే వ‌రుణ‌న్ అనే త‌మిళ చిత్రంలోనూ న‌టించింది. ఎల్లీ మ‌రోవైపు డ్యాన్స్ రియాలిటీ షోల జ‌డ్జిగాను బాగానే ఆర్జిస్తోంది.