ఎల్లమ్మ మరో కాంతార అయ్యేనా..?
ఒక్కమాటలో చెప్పాలంటే కాంతారా సినిమా చూసినప్పుడు ఎలా అయితే ఆడియన్స్ పూనకాలతో ఊగిపోయారో అలానే ఈ సినిమాలో కూడా కొన్ని సీన్స్ ఆడియన్స్ ని షేక్ చేస్తాయని అంటున్నారు.
By: Tupaki Desk | 29 Jun 2025 6:00 AM ISTబలగం సినిమాతో డైరెక్టర్ గా తొలి ప్రయత్నం తోనే సూపర్ హిట్ అందుకున్నాడు వేణు. కమెడియన్ గా సినిమాలు షోలు చేసిన అతనిలో ఇంత సీరియస్ కథకుడు ఉంటాడని అతను ఆడియన్స్ ని ఎమోషనల్ గా మెప్పించేలా చేస్తాడని ఎవరు ఊహించి ఉండరు. బలగం సినిమా క్లాస్ మాస్ అన్న తేడా లేకుండా అందరినీ కదిలించింది. ఆ సినిమా చేసిన అద్భుతాలు అన్నీ ఇన్నీ కాదు. అలాంటి మ్యాజిక్ చేశాడు కాబట్టే దిల్ రాజు ఈసారి అతనికి మరో గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. దిల్ రాజు నిర్మాణంలోనే వేణు తన నెక్స్ట్ సినిమా ఎల్లమ్మ చేస్తున్నాడు.
నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ ఫిమేల్ లీడ్ గా నటిస్తుంది. సినిమా స్క్రిప్ట్ లాక్ కాగా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తుందని తెలుస్తుంది. దిల్ రాజు ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తుంది. ఐతే ఎల్లమ్మ దేవత కథతో రాబోతున్న ఈ సినిమా ఆధ్యాత్మికతతో తెరకెక్కిస్తారని తెలుస్తుంది. సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయని అంటున్నారు.
ఒక్కమాటలో చెప్పాలంటే కాంతారా సినిమా చూసినప్పుడు ఎలా అయితే ఆడియన్స్ పూనకాలతో ఊగిపోయారో అలానే ఈ సినిమాలో కూడా కొన్ని సీన్స్ ఆడియన్స్ ని షేక్ చేస్తాయని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ టైం లో కూడా చాలా వరకు సీక్రెట్ గా ఉంచేలా కండీషన్స్ పెడుతున్నారట. లొకేషన్స్ నుంచి ఎలాంటి సీన్స్ లీక్ అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
ఆల్రెడీ వేణు లొకేషన్స్ ఓకే చేయగా త్వరలో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. మరి వేణు చేస్తున్న ఎల్లమ్మ నిజంగానే కాంతారని తలపిస్తుందా ఆ సినిమాను మించి ఉంటుందా అన్నది సినిమా వచ్చాక తెలుస్తుంది. కాంతారా లో రిషబ్ శెట్టి తన పూనకాలు తెప్పించే పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. ఎల్లమ్మ సినిమాలో ఆ బాధ్యతను కీర్తి సురేష్ తీసుకుంటుందని తెలుస్తుంది. ఆల్రెడీ మహానటితో నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి సురేష్ మరోసారి ఎల్లమ్మతో అందుకు ఏమాత్రం తగ్గని అభినయం చూపిస్తుందని అంటున్నారు. మరి వేణు యెల్దండి ఈసారి ఏం చేస్తాడన్నది చూడాలి. తప్పకుండా వేణుకి ఇది గొప్ప అవకాశమని చెప్పొచ్చు.
