Begin typing your search above and press return to search.

రేపే ఫిలించాంబ‌ర్ ఎన్నిక‌లు.. గెలుపు గుర్రం ఎవ‌రో?

ఈసారి చాంబ‌ర్ ఎన్నిక‌ల్లో ఎప్ప‌టిలానే సి.క‌ళ్యాణ్ ప్యానెల్ .. దిల్ రాజు ప్యానెల్ పోటీప‌డ‌నున్నాయి.

By:  Tupaki Desk   |   29 July 2023 6:54 PM GMT
రేపే ఫిలించాంబ‌ర్ ఎన్నిక‌లు.. గెలుపు గుర్రం ఎవ‌రో?
X

2023-2025 సీజ‌న్ కి ఫిలించాంబ‌ర్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈసారి చాంబ‌ర్ ఎన్నిక‌ల్లో ఎప్ప‌టిలానే సి.క‌ళ్యాణ్ ప్యానెల్ .. దిల్ రాజు ప్యానెల్ పోటీప‌డ‌నున్నాయి. ఇరువ‌ర్గాలు ఎవ‌రికి వారు పోటీ వ్యూహం లో త‌ల‌మున‌క‌లుగా ఉన్నారు. ప్ర‌చార‌పు ఎత్తుగ‌డ‌ల‌తో ముందుకు సాగుతున్నారు. వాణిజ్య మండ‌లి లో 1600 మంది స‌భ్యులు ఉండ‌గా 900 మంది ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నార‌ని తెలిసింది. రేపు ఉద‌యం 7 గం.ల నుంచి 3 గం.ల వ‌ర‌కూ పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌గా సాయంత్రం 6 గంట‌ల‌ కు ఓట్ల లెక్కింపును పూర్తి చేసి ఫ‌లితాన్ని వెలువ‌రిస్తారు.

ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల వేళ ప్రముఖ నిర్మాత దిల్ రాజు త‌న విజ‌న్ ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ పదవి కి పోటీ చేస్తున్న దిల్ రాజు.. ఎన్నికల్లో తన ప్యానల్ సభ్యుల వివరాలను వెల్లడించి తాము చేప‌ట్టే సంక్షేమ కార్య‌క్ర‌మాల గురించి వెల్ల‌డించారు. దిల్ రాజు ఫిల్మ్ ఛాంబర్ పట్ల తన విజన్‌ ను తెలిపారు.

తెలుగు సినిమా సోదరభావాన్ని పెంపొందించడానికి తాను సమిష్టి కృషి చేస్తాన‌ని ఆయ‌న నొక్కి చెప్పారు. తన ప్రధాన లక్ష్యం విమర్శలు లేదా అధికార పోరాటాల్లో పాల్గొనడం కాదని పరిశ్రమ మొత్తం సంక్షేమం పురోగతికి కృషి చేయడమేన ని తెలియజేశారు. చిన్న సినిమా అభివృద్ధికి త‌న‌వంతు కృషి చేస్తాన‌ని మాటిచ్చారు.

మ‌రోవైపు నిర్మాత‌ల సంక్షేమం కోసం తాను ఫైవ్ స్టార్ సౌక‌ర్యాల‌తో ఓల్డేజ్ హోమ్ ని క‌డ‌తామ‌ని సి.క‌ళ్యాణ్ ప్ర‌క‌టించారు. మంచివాళ్ల‌కే ఓటు వేయండి అని ప్ర‌చారం చేస్తున్నారు. తాను చాంబ‌ర్ లో ఒక చిన్న ప‌ద‌వి లో ఉన్న‌ప్పుడే మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్ చేయించాన‌ని సి.క‌ళ్యాణ్ గుర్తు చేసారు.

ప‌రిశ్ర‌మ పెద్ద కీ.శే. దాస‌రి నారాయ‌ణ‌రావు బాట‌ లోనే తాము సేవాకార్య‌క్ర‌మాలు చేస్తున్నామ‌ని ఆయన అన్నారు. ఫిలిం ఛాంబర్ ఎన్నికలు తెలుగు చిత్ర పరిశ్రమకు ముఖ్యమైన ఘట్టంగా మారాయి. ఈసారి ఎన్నిక‌ల‌ లో గెలుపు గుర్రం ఎవ‌రో రేప‌టి సాయంత్రానికి తేలిపోనుంది.