Begin typing your search above and press return to search.

సాయి పల్లవి బీటౌన్ డెబ్యూ సంగతేంటి? ఆడియన్స్ ఏమంటున్నారు?

సౌత్‌ లో తన నేచురల్ యాక్టింగ్‌ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్‌ లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 May 2026 11:03 AM IST
సాయి పల్లవి బీటౌన్ డెబ్యూ సంగతేంటి? ఆడియన్స్ ఏమంటున్నారు?
X

సౌత్‌ లో తన నేచురల్ యాక్టింగ్‌ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్‌ లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటించిన ఏక్ దిన్ ద్వారా ఆమె బీటౌన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఆ చిత్రం.. నేడు థియేటర్స్ లో విడుదలైంది. అయితే సోషల్ మీడియాలో ఆ మూవీ టాక్ ఎలా ఉంది? ఆడియన్స్ ఏమంటున్నారు?

నిజానికి ఏక్ దిన్ మూవీ 2016లో వచ్చిన థాయ్ చిత్రం వన్ డేకి అఫీషియల్ రీమేక్. కథ సింపుల్‌ గా ఉండటం, రన్ టైమ్ కూడా తక్కువగా ఉండటం వల్ల ఫస్ట్ హాఫ్ ఆకట్టుకుంటుందని సినీ ప్రియులు చెబుతున్నారు. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కథ నడిపిన తీరు ఫ్రెష్ ఫీల్ ఇస్తోందని, ముఖ్యంగా జునైద్ ఖాన్- సాయి పల్లవి జంట స్క్రీన్‌ పై క్యూట్‌ గా కనిపించడం సినిమాకు ప్లస్ పాయింట్‌ గా నిలిచిందని అంటున్నారు.

అయితే అసలు సమస్య రెండో భాగంలో మొదలవుతుందని అభిప్రాయపడుతున్నారు. కథను త్వరగా క్లోజ్ చేయాలనే ప్రయత్నం క్లియర్ గా కనిపించిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. క్లైమాక్స్‌ ను అవసరానికి మించి లాగడం, కీలక మలుపుల్లో కథ వీక్ గా ఉండడం ప్రేక్షకులను నిరాశపరుస్తోందని చెబుతున్నారు.. ముఖ్యంగా ఎమోషనల్ కనెక్ట్ కావాల్సిన చోట కథ పట్టు కోల్పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జునైద్ ఖాన్ విషయానికి వస్తే, తన పాత్రకు తగ్గట్లు నటించారని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎమోషనల్ సీన్స్ లో మంచి ఇంపాక్ట్ చూపించారని అంటున్నారు. అయితే స్క్రిప్ట్ వీక్ గా ఉండడం వల్ల ఆయన యాక్టింగ్ పూర్తిగా చూసే అవకాశం రాలేదని చెబుతున్నారు. ఇక సాయి పల్లవి గురించి చెప్పాల్సిన అవసరం లేదని, ఆమె స్క్రీన్‌ పై కనిపించిన ప్రతిసారీ తన కళ్లతోనే ఫీలింగ్స్ ను ఎక్స్ప్రెస్ చేశారని చెబుతున్నారు.

తన నేచురల్ యాక్టింగ్, ఎక్స్ప్రెషన్స్‌ తో సినిమా మొత్తాన్ని భుజాలపై మోసిందనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. అయితే ఆమె డెబ్యూ కోసం ఇంకా స్ట్రాంగ్ కథ ఉంటే బాగుండేదని కూడా పలువురు అంటున్నారు. మరో సినిమాతో ఎంట్రీ ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు. మెమొరీ లాస్ అయిన అమ్మాయి రోల్ లో కనిపించారని, కానీ అలాంటి స్టోరీలు చాలా వచ్చాయని చెబుతున్నారు.

సినిమాలో కామెడీ ఎలిమెంట్ కొంచెం తక్కువగా ఉండటం కూడా మైనస్‌ గా మారిందని చెబుతున్నారు. సంగీత దర్శకుడు రామ్ సంపత్ అందించిన పాటలు, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ మాత్రం కథకు తగ్గట్టుగా ఉండి మంచి ఫీల్ ఇస్తాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఏక్ దిన్ ఫస్ట్ హాఫ్ బాగున్నా, సెకండ్ హాఫ్ సినిమాను పూర్తిగా నిలబెట్టలేకపోయిందని చెబుతున్నారు. సాయి పల్లవి నటన చిత్రానికి మెయిన్ హైలైట్‌ గా నిలిచినా.. వీక్ స్టోరీ వల్ల సినిమా అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఫ్యూచర్ లో బాలీవుడ్ లో ఆమె ఎలాంటి ప్రాజెక్ట్‌ లను ఎంచుకుంటారన్నది ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.