Begin typing your search above and press return to search.

హీరో జీవితం మాత్రం మార‌లేదు!

నిర్మాతలు మార్కెట్ లో నిల‌బ‌డ‌గ‌లిగారు. రీ-రిలీజ్ సంద‌ర్భంగా మా ఈ జీవితాలు మార్చేసిన సినిమా అంటూ నిర్మాత‌లు మ‌రోసారి సంతోషం వ్య‌క్తం చేసారు.

By:  Tupaki Desk   |   23 March 2024 8:30 AM GMT
హీరో జీవితం మాత్రం మార‌లేదు!
X

రీ-రిలీజ్ లంటే స్టార్ హీరోలే చిత్రాలే రిలీజ్ అవుతుంటాయి. అగ్ర హీరోల సినిమాల్ని మాత్ర‌మే రీ-రిలీజ్ చేస్తే వ‌ర్కౌట్ అవుతుంద‌నే ఓ న‌మ్మ‌కంతో చేస్తుంటారు. చిరంజీవి..బాల‌కృష్ణ‌...మ‌హేష్‌..ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సినిమాలే రిలీజ్ అయ్యాయి. ఇలా కొంత మంది స్టార్లే రీ-రిలీజ్ లో క‌నిపిస్తు న్నారు. సీనియ‌ర్ హీరోలైన నాగార్జున‌..వెంక‌టేష్ లాంటి స్టార్లు కూడా ఈ లిస్ట్ లో లేరు. వాళ్ల పుట్టిన రోజు సంద‌ర్భంగానో...మ‌రో కార‌ణంతోనే ఆ హీరోల చిత్రాల్ని రీ-రిలీజ్ చేసి అభిమానుల్ని ఖుషీ చేస్తున్నారు.


చిన్న చిత్రాలేవి ఇంత‌వ‌ర‌కూ రీ-రిలీజ్ లో ఎక్క‌డా క‌నిపించ‌లేదు. అయితే తొలిసారి ఈరోజుల్లో అనే ఓ చిన్న సినిమాని రీ-రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇందులో శ్రీ...రేష్మ జంట‌గా న‌టించారు. ఇక ఈ సినిమా కంటెంట్ గురించి తెలిసిందే. కేవ‌లం యూత్ ని మాత్ర‌మే టార్గెట్ చేసి తెర‌కెక్కించిన సినిమా అప్ప‌ట్లో బాగానే ఆడింది. ఈ సినిమాతోనే మారుతికి గుర్తింపు ద‌క్కింది. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా అవ‌కాశాలు మొద‌ల య్యాయి.

నిర్మాతలు మార్కెట్ లో నిల‌బ‌డ‌గ‌లిగారు. రీ-రిలీజ్ సంద‌ర్భంగా మా ఈ జీవితాలు మార్చేసిన సినిమా అంటూ నిర్మాత‌లు మ‌రోసారి సంతోషం వ్య‌క్తం చేసారు. అయితే ఇక్క‌డ హీరో జీవితం మాత్రం మార‌లేద‌నే విమ‌ర్శ తెర‌పైకి వ‌స్తోంది. ఈరోజుల్లో త‌ర్వాత శ్రీ మంచి న‌టుడు అవుతాడ‌ని..ఇండ‌స్ట్రీలో కెరీర్ బాగుంటుంద‌ని భావించారంతా. కానీ అత‌ని కెరీర్ ఆశించిన విధంగా సాగ‌లేదు. `ల‌వ్ సైకిల్` స‌హా కొన్ని సినిమాలు చేసాడు. కానీ స‌క్స‌స్ అవ్వ‌లేదు. ఆ త‌ర్వాత కొన్నాళ్లు ఆహీరో ఇండ‌స్ట్రీలో క‌నిపించ‌లేదు.

కానీ మారుతి మాత్రం మంచి ద‌ర్శ‌కుడిగా ఎదిగాడు. అలాగే నిర్మాత‌లు నేడు మంచి పోజిష‌న్ లో ఉన్నారు. అందుకు వాళ్లెంతో శ్ర‌మించారు అన్న‌ది అంతే వాస్త‌వం. అందుకే `ఈరోజుల్లో` రీ-రిలీజ్ చేసి మ‌ళ్లీ ఆ నాటి జ్ఞాప‌కాలు నెమ‌ర‌వేసుకోవ‌డానికి రెడీ అయ్యారు. మ‌రి రీ-రిలీజ్ సంద‌ర్భంగా శ్రీని మీడియా ప్ర‌చారంలో భాగం చేస్తారా? లైట్ తీసుకుంటారా? అన్న‌ది చూడాలి.