Begin typing your search above and press return to search.

రాహుల్ సిప్లిగంజ్.. నీ అయ్య నా మామ

బిగ్ బాస్ విన్నర్ గా అతనికి వచ్చిన ఇమేజ్ కంటే ఆస్కార్ విన్నింగ్ సాంగ్ గాయకుడిగా ఎక్కువ ఫేం వచ్చింది

By:  Tupaki Desk   |   10 Nov 2023 3:44 PM GMT
రాహుల్ సిప్లిగంజ్.. నీ అయ్య నా మామ
X

వెస్ట్రన్ బీట్స్ కి తెలంగాణ ఫోక్స్ మిక్స్ చేస్తే కచ్చితంగా అది కొత్త ప్రయోగం అవుతుంది. అలాంటి ప్రయోగాలు ఎక్కువగా ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ చేస్తూ ఉంటారు. బస్తీ నుంచి ఆస్కార్ వేదికపైకి వెళ్లి పాట పాడే అరుదైన సొంతం చేసుకున్నారు. అలాగే ఇండియాలో ఆస్కార్ అవార్డు అందుకున్న సాంగ్ పాడిన గాయకుడిగా కూడా అరుదైన ఘనత దక్కించుకున్నాడు.


బిగ్ బాస్ విన్నర్ గా అతనికి వచ్చిన ఇమేజ్ కంటే ఆస్కార్ విన్నింగ్ సాంగ్ గాయకుడిగా ఎక్కువ ఫేం వచ్చింది. టాలీవుడ్ లో స్టార్ సింగర్ ఇప్పుడు రాహుల్ దూసుకుపోతున్నాడు. మరో వైపు తానే ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ప్రైవేట్ సాంగ్స్ ని చేస్తున్నాడు. ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ తో తాజాగా నీ అయ్యా నా మామ అంటూ సాగే సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ షూటింగ్ మొత్తం దుబాయ్ లోనే షూట్ చేయడం విశేషం.

వెస్ట్రన్ అందాలతో పాటు హాట్ మోడల్స్ తో వెస్ట్రన్ స్టైల్ మ్యూజిక్ బీట్ లోనే కాశర్ల శ్యామ్ రాసిన సాంగ్ ని ఆవిష్కరించాడు. తానే సాంగ్ లో నటించి రాహుల్ సిప్లిగంజ్ పాడటం విశేషం. ఈ సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. వెస్ట్రన్ అందాలతో ఈ సాంగ్ లో అద్భుతమైన విజువల్స్ తో ప్రెజెంట్ చేశారు. సినిమాకి ఏ మాత్రం తక్కువ కాకుండా విజువల్స్ చూపించడం విశేషం.

ఈ సాంగ్ లో రాహుల్ కి జోడీగా జెన్నిఫర్ ఇమ్మాన్యూయేల్ నటించింది. రాహుల్ ఓ వైపు అదిరిపోయే డాన్స్ తో తెలంగాణ మాండలికంలో పడికట్టు పదాలతో కాశర్ల శ్యామ్ రాసిన పాటని అద్భుతంగా ఆలపించడం విశేషం. ఈ సాంగ్ రిలీజ్ చేసిన వెంటనే వైరల్ అయిపొయింది. తెలంగాణ స్లాంగ్ లో పడికట్టు పదాలకి సాంగ్ తో రాహుల్ అందం తీసుకొచ్చాడని నెటిజన్లు నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి.

గురువారం రాహుల్ సిప్లిగంజ్ తన యుట్యూబ్ ఛానల్ లో సాంగ్ రిలీజ్ చేయగా ఇప్పటి వరకు 2 లక్షలకి పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. రాహుల్ ఫ్యాన్స్ అందరూ ట్విట్టర్ లో ఈ సాంగ్ ని షేర్ చేస్తున్నారు. విజువల్ లో బికినీ షూట్ లలో ఫారిన్ భామల అందాలతో అద్భుతంగా ఆవిష్కరించడంతో సాంగ్ కలర్ ఫుల్ గా ఉందనే మాట వినిపిస్తోంది.