Begin typing your search above and press return to search.

ఈ నగరానికి ఏమైంది రిపీట్‌తో మళ్లీ ఫన్‌ఫుల్ బ్యాచ్!

సినిమా అంటే కేవలం కథే కాదు.. ఆ కథని అల్లే స్టైల్, పర్సనాలిటీ కూడా ముఖ్యమవుతుంది. అలాంటి ఓ స్టైల్ ఫిలిం 'ఈ నగరానికి ఏమైంది'.

By:  Tupaki Desk   |   29 Jun 2025 7:09 AM
ఈ నగరానికి ఏమైంది రిపీట్‌తో మళ్లీ ఫన్‌ఫుల్ బ్యాచ్!
X

సినిమా అంటే కేవలం కథే కాదు.. ఆ కథని అల్లే స్టైల్, పర్సనాలిటీ కూడా ముఖ్యమవుతుంది. అలాంటి ఓ స్టైల్ ఫిలిం 'ఈ నగరానికి ఏమైంది'. యూత్ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా రీ రిలీజ్ సమయంలో మరోసారి సాలిడ్ రెస్పాన్స్ అందుకుంది. అలా కల్ట్ క్లాసిక్‌గా మారిపోయిన ఈ చిత్రం ఇప్పుడు సీక్వెల్‌తో తిరిగి వస్తోంది.

తాజాగా 'ఈ నగరానికి ఏమైంది రిపీట్' అనే టైటిల్‌తో సీక్వెల్ ప్రకటించారు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మరోసారి మెగాఫోన్ పట్టారు. డి. సురేష్ బాబు, స్రుజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి కలిసి ఎస్ ఒరిజినల్స్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. మళ్లీ అదే బ్యాచ్.. అదే వెన్నెల ఫ్రెండ్‌షిప్‌తో తెరపై సందడి చేయబోతోంది.

ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ పోస్టర్ అయితే యూత్‌లో వైరల్ అయిపోయింది. గాల్లో వేలాడుతూ కనిపిస్తున్న ఓ బృఫ్‌కేస్, ఎగిరిపోతున్న, బీర్లూ, సూట్‌కేస్ లోంచి బయటపడుతున్న దుస్తులు.. ఇలా మోషన్ పోస్టర్ మొత్తం ట్రిప్, యూత్ మూడ్‌ను కలిపినట్టుంది. టైటిల్‌లో ENEకి రెండు తెలుగు అక్షరాలు జత చేసి చివరిది మిర్రర్‌గా డిజైన్ చేయడం ఆఫ్‌బీట్ కాన్సెప్టుకు నిదర్శనం. ట్యాగ్‌లైన్ ‘ఏళినాటి శని అయిపోయింది.. కన్యారాశి టైమ్ వచ్చిందీ’ అంటూ చెప్పుకోవడం ట్రెండ్‌ను రిపీట్ చేస్తోంది.

ఈ సారి కథ ఎక్కడికెళ్తుందో తెలియదు కానీ, మొదటి భాగంలో నటించిన విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను మళ్లీ బ్యాక్ టు ఫన్నీ ఫామ్‌లోకి వచ్చేస్తున్నారు. గతంలో వీరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈసారి మరింత యూత్ ఫన్‌తో, తరుణ్ భాస్కర్ తన మార్క్ హ్యూమర్‌తో మరోసారి అదే వైబ్ క్రియేట్ చేస్తాడని అంచనాలు ఉన్నాయి.

టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే.. మ్యూజిక్ డైరెక్టర్‌గా వివేక్ సాగర్ మరోసారి రీటెన్ చేస్తుండడం సంగీత ప్రియులకు గుడ్ న్యూస్. కెమెరామెన్‌గా ఏజె అరోన్ పని చేస్తున్నారు. ఎడిటర్‌గా రవితేజ గిరిజాల కొనసాగుతుండగా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా సౌమిత్రి ఎన్ పనిచేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ ఇప్పటికే జోరుగా కొనసాగుతోంది. మొత్తానికి 'ఈ నగరానికి ఏమైంది రిపీట్' అనే టైటిల్‌తో వస్తున్న ఈ సీక్వెల్ ఇప్పటికే అభిమానుల్లో మంచి హైప్ క్రియేట్ చేస్తోంది.