సీక్వెల్ కోసం తరుణ్ ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడుగా!
ఇప్పటికే పలు షెడ్యూళ్లలో కొంత భాగం మేర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ నగరానికి ఏమైంది2 గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 7 Feb 2026 8:15 AM ISTటాలీవుడ్ లోని యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్లలో ఈ నగరానికి ఏమైంది కూడా ఒకటి. 2018లో రిలీజైన ఈ సినిమాకు అప్పట్లో చెప్పుకోదగ్గ క్రేజ్ ఏమీ రాలేదు. కానీ సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత రాను రాను క్రేజ్ ఎక్కువైపోయింది. ఆ క్రేజ్ వల్లే ఈ సినిమా రీరిలీజ్ కు ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. మొదట్లో రిలీజైనప్పటి కంటే రీరిలీజ్ టైమ్ లోనే ఈ మూవీకి ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి.
ఏమైంది ఈ నగరానికి మూవీకి సీక్వెల్ గా మూవీ..
విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ ముగ్గురూ కలిసి గోవా వెళ్లి చేసే రచ్చే ఈ నగరానికి ఏమైంది కాగా, ఈ మూవీ వచ్చినప్పటి నుంచే దీనికి సీక్వెల్ రానుందని అన్నారు. కానీ సినిమా రిలీజై 8 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఈ సినిమాకు సీక్వెల్ రాలేదు. రీసెంట్ గానే ఈ సీక్వెల్ సినిమా సెట్స్ పైకి వెళ్లిన సంగతి తెలిసిందే.
థాయ్‌లాండ్ లోనే ఎక్కువ భాగం షూటింగ్
సెట్స్ పైకి వెళ్లిన ఈ క్రేజీ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే పలు షెడ్యూళ్లలో కొంత భాగం మేర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ నగరానికి ఏమైంది2 గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తోంది. ఈ హిట్ సినిమా సీక్వెల్ థాయ్‌లాండ్ లో జరగనుందని సమాచారం. ఈ నగరానికి ఏమైంది2 సినిమాలో దాదాపు 40% భాగాన్ని పూర్తిగా థాయ్‌లాండ్ లోనే షూట్ చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. చూస్తుంటే తరుణ్ భాస్కర్ ఈ సీక్వెల్ విషయంలో ఏదో చాలా గట్టిగానే ప్లాన్ చేశారనిపిస్తోంది.
ఈ ఫ్రాంచైజ్ లో మొదటి భాగం గోవాలో ఎక్కువగా షూటింగ్ జరిగితే, సెకండ్ పార్ట్ థాయ్‌లాండ్ బ్యాక్ డ్రాప్ లో జరగనుందని తెలుస్తోంది. ఇది తెలుసుకున్న ఆడియన్స్ ఈ సీక్వెల్ కేవలం షూటింగ్ బ్యాక్ డ్రాప్ మాత్రమే మారిందని, ఎంటర్టైన్‌మెంట్ మాత్రం అంతకంటే ఎక్కువగా ఉండనుందని భావిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
దీని వల్ల సినిమా బడ్జెట్ కూడా పెరగనుందని, మొదటి భాగం కంటే చాలా భారీ ఖర్చుతో ఈ సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారని అంటున్నారు. లొకేషన్స్, పర్మిషన్లు, నటీనటుల రెమ్యూనరేషన్లు ఇలా ప్రతీదీ చాలా భారీగానే ఖర్చు పెట్టాల్సి వస్తుందని, మరి ఆ బడ్జెట్ మొత్తాన్ని చిత్ర యూనిట్ తిరిగి రాబట్టుకోగలదా లేదా అనేది ఇప్పుడు డిస్కషన్ గా మారింది.
