సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ పై డైరెక్టర్ హింట్
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమాకు ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
By: Tupaki Desk | 22 Jun 2025 1:20 PMతరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమాకు ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. టాలీవుడ్ యూత్ కు నచ్చిన కొన్ని క్లాసిక్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్స్ లో ఈ నగరానికి ఏమైంది కూడా ఒకటి. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ఈ సాలిడ్ ఎంటర్టైనర్ సింపుల్ కథతో యూత్ ను ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది.
రీసెంట్ గా ఈ సినిమా రీరిలీజవగా ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కేవలం రెస్పాన్స్ మాత్రమే కాకుండా రీరిలీజ్ కు కూడా మంచి కలెక్షన్స్ రావడంతో ఈ సినిమాపై ఇప్పటికీ ఎంత క్రేజ్ ఉందో అందరికీ స్పష్టంగా అర్థమైంది. అలాంటి ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడొస్తుందనే ప్రశ్న చాలా కాలంగా ఆడియన్స్ మదిలో మెదులుతుంది.
ఇప్పుడు ప్రేక్షకుల నిరీక్షణ ముగిసినట్టు అనిపిస్తుంది. ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ గురించి తరుణ్ భాస్కర్ తన ఇన్‌స్టాగ్రమ్ లో ఓ హింట్ ఇచ్చారు. జులై 29న ఈ సినిమా 7వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ గురించి కీలక అప్డేట్ రాబోతున్నట్టు తరుణ్ భాస్కర్ పోస్ట్ చేసిన స్టోరీ సూచిస్తుంది. ఈ సీక్వెల్ లో కూడా మొదటి భాగంలో నటించిన విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, సాయి సుశాంత్ రెడ్డి, వెంకటేష్ కీలక పాత్రల్లో నటించనున్నారు.
సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు మొదటి భాగానికి మ్యూజిక్ అందించిన వివేక్ సాగరే సంగీతాన్ని అందించనున్నట్టు సమాచారం. అధికారికంగా సినిమా అనౌన్స్ అయి, సెట్స్ పైకి వెళ్లాక చిత్ర యూనిట్ నుంచి మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశాలున్నాయి. మొత్తానికి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సీక్వెల్ గురించి త్వరలోనే అనౌన్స్‌మెంట్ రానుందన్నమాట.