Begin typing your search above and press return to search.

'ఆర్‌ఆర్‌ఆర్‌' పై వరల్డ్‌ స్టార్ కామెంట్స్‌

తాజాగా ప్రపంచ వ్యాప్తంగా తన సింగింగ్ తో ఉర్రూతలూగించిన ఎడ్ షీరన్‌ కూడా ఆర్‌ఆర్‌ఆర్ ఫ్యాన్స్ జాబితాలో చేరి పోయాడు

By:  Tupaki Desk   |   15 March 2024 1:19 PM GMT
ఆర్‌ఆర్‌ఆర్‌ పై వరల్డ్‌ స్టార్ కామెంట్స్‌
X

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా పై ఇప్పటికే బాలీవుడ్‌ స్టార్స్ తో పాటు హాలీవుడ్‌ స్టార్స్‌ ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేసిన విషయం తెల్సిందే. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా తన సింగింగ్ తో ఉర్రూతలూగించిన ఎడ్ షీరన్‌ కూడా ఆర్‌ఆర్‌ఆర్ ఫ్యాన్స్ జాబితాలో చేరి పోయాడు.

ప్రపంచ వ్యాప్త గుర్తింపును కలిగి ఉన్న ఎడ్‌ షీరన్‌ ప్రస్తుతం ఇండియాలో షో కోసం వచ్చాడు. ఆయనకు పార్టీ ఇచ్చేందుకు బాలీవుడ్‌ స్టార్స్ పోటీ పడుతున్నారు. తాజాగా షారుఖ్ ఖాన్‌ ఇచ్చిన విందులో ఎడ్‌ షీరన్‌ పాల్గొన్నారు. ఆ పార్టీ లో బాలీవుడ్‌ తో పాటు సౌత్‌ స్టార్స్ ఎంతో మంది పాల్గొన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ దంపతులు కూడా ఎడ్ షీరన్ పార్టీ లో పాల్గొన్నారు.

ఇండియాలో ఉన్న ఎడ్‌ షీరన్‌ ఇండియన్ మూవీస్‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను గత ఏడాది స్నేహితులతో కలిసి ఆర్ఆర్‌ఆర్ సినిమాను చూశాను అంటూ చెప్పుకొచ్చాడు. ఆ సినిమాలోని నాటు నాటు పాటను బాగా ఎంజాయ్ చేశామని, అంతే కాకుండా సినిమా టెక్నికల్ గా ఒక అద్భుతం అన్నట్లుగా ఉందని ఎడ్‌ షీరన్ చెప్పుకొచ్చాడు.

షారుఖ్ ఖాన్‌ ఇచ్చిన పార్టీలో స్టార్స్‌ తో కలిసి అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురంలో సినిమాలోని బుట్టబొమ్మ బుట్టబొమ్మ పాటకు ఎడ్‌ షీరన్‌ డాన్స్ చేశాడు. మొత్తానికి ఆయన నోట తెలుగు సినిమా పేరు మరియు పాట రావడం చాలా గర్వంగా ఉందని ఆయన తెలుగు అభిమానులు మాట్లాడుకుంటున్నారు.