Begin typing your search above and press return to search.

నా పెళ్లి అయింది.. శ్రేయస్‌ పిల్లలకు తల్లిని నేనే!

టీం ఇండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కి ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

By:  Tupaki Desk   |   10 Jun 2025 3:15 PM IST
నా పెళ్లి అయింది.. శ్రేయస్‌ పిల్లలకు తల్లిని నేనే!
X

టీం ఇండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కి ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీం ఇండియా జట్టులో ప్రతి ఒక్కరికీ కోట్లాది మంది ఫ్యాన్స్ ఉంటారు. అలాంటిది స్టార్‌ ప్లేయర్‌ కావడంతో శ్రేయస్ అయ్యర్‌కి ఫాలోయింగ్‌ మరింత ఎక్కువ ఉంటుంది అనడంలో సందేహం లేదు. కోట్లాది మంది అభిమానించే శ్రేయస్‌ అయ్యర్‌ పై ఒక టీవీ స్టార్‌ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చాలా మంది షాక్‌ అయ్యే విధంగా కూడా ఉన్నాయి. బిగ్‌బాస్ 18 ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ దుబాయ్ ముద్దుగుమ్మకు శ్రేయస్ అయ్యర్ అంటే అభిమానం కంటే ఎక్కువ. అందుకే అతడిని పెళ్లి చేసుకున్నాను అని ప్రకటించింది.

దుబాయ్‌లో నివాసం ఉండే నటి ఎడిన్‌ రోజ్‌ మాట్లాడుతూ... శ్రేయస్ అయ్యర్‌తో నాకు పెళ్లి అయింది. నా మనసులో ఇప్పటికే నేను అతడికి భార్యగా ఉన్నాను. అతడి పిల్లలకు తల్లిని కూడా అనుకుంటున్నాను. అతడు నా జీవితంలో ఒక భాగంగా ఉన్నాడు. అతడితో జీవితం పంచుకుంటున్నట్లుగానే నేను నా జీవితాన్ని సాగిస్తున్నాను అంటూ షాకింగ్‌ వ్యాఖ్యలు చేసింది. అతడికి ఉన్న ఫాలోయింగ్‌ కారణంగా ఎడిన్‌ రోజ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని, కేవలం పబ్లిసిటీ కోసమే ఆమె ఇలా మాట్లాడుతుందని చాలా మంది అనుకున్నారు. కానీ ఆమె మాటల్లో నిజాయితీ కనిపిస్తుందని, ఆమె చేస్తున్న వ్యాఖ్యల్లో ప్రేమ కనిపిస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

శ్రేయస్‌ అయ్యర్‌ ను వివాహం చేసుకున్నట్లుగా భావిస్తున్నట్లు ఎడిన్‌ రోజ్‌ విషయం గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆమె తన అభిమానంను చాటుకునే విధానం ఇది కాదు అంటూ కొందరు అంటూ ఉంటే, కొందరు మాత్రం ఆమె ఇలా చేయడం ద్వారా శ్రేయస్ అయ్యర్‌ను వివాహం చేసుకోవచ్చు అని భావిస్తూ ఉంటుంది అంటున్నారు. మొత్తంగా శ్రేయస్ అయ్యర్‌ దృష్టిని ఆకర్షించడం కోసం ఈమె చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఆమె అభిమానంలో, ప్రేమలో నిజాయితీ ఉంటే కచ్చితంగా శ్రేయస్ ఆమెను కలుస్తాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శ్రేయస్ ప్రస్తుతం మంచి ఫామ్‌తో క్రికెట్‌లో కొనసాగుతున్నాడు.

బిగ్‌ బాస్ షో ద్వారా ఇండియన్ బుల్లి తెర ప్రేక్షకులకు చేరువ అయిన ఈ అమ్మడు ముందు ముందు బాలీవుడ్‌ సినిమాల్లో కూడా నటించే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌, సౌత్‌ సినిమాల్లో ఆఫర్లు వస్తే కాదు, వద్దు అనకుండా నటించేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆకట్టుకునే విధంగా ఉండే ఈ అమ్మడిని నిజంగానే శ్రేయస్ అయ్యర్‌ పెళ్లి చేసుకోవచ్చు కదా అంటూ కొందరు సరదాగా సోషల్‌ మీడియాలో కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఇంతకు ఈమె గురించి శ్రేయస్ అయ్యర్‌ ఎలా స్పందిస్తాడు, ఈమె విషయాలు అతడి వద్దకి చేరి ఉంటాయా అనేది తెలియాల్సి ఉంది.