Begin typing your search above and press return to search.

ఈడీ ఎంట్రీ.. విజయదేవరకొండతో పాటు 29 మందికి తాజా నోటీసులు

కొద్ది వారాల క్రితం వరకు హాట్ టాపిక్ గా మారటమే కాదు సినీ ప్రముఖులు.. సెలబ్రిటీలకు షాకుల మీద షాకులు ఇచ్చిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తిరిగింది.

By:  Tupaki Desk   |   10 July 2025 9:54 AM IST
ఈడీ ఎంట్రీ.. విజయదేవరకొండతో పాటు 29 మందికి తాజా నోటీసులు
X

కొద్ది వారాల క్రితం వరకు హాట్ టాపిక్ గా మారటమే కాదు సినీ ప్రముఖులు.. సెలబ్రిటీలకు షాకుల మీద షాకులు ఇచ్చిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. పలువురి ఆత్మహత్యలకు మాత్రమే కాదు.. ఆర్థికంగా దెబ్బ తీసిన ఈ బెట్టింగ్ యాప్స్ ఇష్యూలోకి ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) ఎంట్రీ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వేలాది మందిని వేధిస్తున్న ఈ బెట్టింగ్ యాప్స్ పై చర్యలు తీసుకోవటంలో సైబర్ పోలీసులు ఎంట్రీ ఇవ్వటం.. కేసునమోదు చేయటం.. నోటీసులు ఇవ్వటం తెలిసిందే.

ఈ క్రమంలో చట్టవిరుద్దంగా నడిచే ఈ బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసిన పలువురు సినీ ప్రముఖుల వ్యవహారశైలిపై చర్చ జరిగింది. తమకు అవగాహన లేదని.. తాము తెలియకుండానే ప్రచారం చేసినట్లుగా ప్రముఖులు ఒప్పుకోవటం తెలిసిందే. అయితే.. చేసింది తప్పే అయినప్పుడు కేసులు నమోదు కాక తప్పవు. ఈ క్రమంలో సినీ ప్రముఖులు విజయ దేవరకొండ లాంటి యూత్ ఫుల్ హీరో మాత్రమే కాదు.. మేధావిగా.. పలు సామాజిక అంశాలపై అవగాహన కల్పించేలా వ్యాఖ్యలు చేసే సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ తోపాటు రానా.. మంచు లక్ష్మి.. నిధి అగర్వాల్.. అనన్య నాగళ్ల.. శ్రీముఖి ఇలా దాదాపు 29 మంది ప్రముఖులపైనా.. కంపెనీల పైనా కేసులు నమోదు చేసిన ఈడీ.. తాజాగా వారికి నోటీసులు జారీ చేసింది.

తాజాగా కేసులు నమోదు చేసిన వారిలో యూట్యూబర్స్.. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు కూడా ఉన్నారు. త్వరలో వీరంతా ఈడీ విచారణను ఎదుర్కోనున్నారు. కొద్ది వారాల క్రితం సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేయటంతో అప్పట్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. అనంతరం ఎలాంటి కదలిక లేకుండా పోయింది. తాజాగా ఈ అంశంలోకి ఈడీ ఎంట్రీ ఇవ్వటంతో.. సినీ ప్రముఖులు.. సెలబ్రిటీలకు కొత్త తలనొప్పులు వచ్చినట్లైంది. ఈ అంశంపై ఈడీ ఇంకేం చర్యలు తీసుకుంటుందో చూడాలి.