Begin typing your search above and press return to search.

ఈగల్.. అస్సలు తగ్గట్లే..

ఈ కారణంగా ఈగల్ మూవీ వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా నడుస్తోంది. అయితే ఈ వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తోంది.

By:  Tupaki Desk   |   1 Nov 2023 12:23 PM GMT
ఈగల్.. అస్సలు తగ్గట్లే..
X

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో సిద్ధం అవుతోంది. మాస్ మహారాజ్ కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో కార్తిక్ ఘట్టమనేని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు

రీసెంట్ గా రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాకి ఎవరేజ్ టాక్ వచ్చింది. అయితే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే బ్రేక్ ఎవెన్ అందుకోలేదు. రవితేజ మార్కెట్ పరంగా చూసుకుంటే సినిమా సినిమాకి అతని ఇమేజ్ పెరుగుతూ వెళ్తోంది. ఇప్పుడు ఈగల్ మూవీపైన కూడా భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే సంక్రాంతి రేసులో చాలా సినిమాలు ఉన్నాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, ఫ్యామిలీ స్టార్ మూవీస్, ఉన్నాయి. అలాగే తమిళం నుంచి శివ కార్తికేయన్ సినిమా వస్తోంది. ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇన్ని సినిమాలు ఒకేసారి రిలీజ్ చేస్తే థియేటర్స్ కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఈ కారణంగా ఈగల్ మూవీ వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా నడుస్తోంది. అయితే ఈ వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తోంది. సంక్రాంతికి ఈగల్ మూవీ రావడం ఖాయం అని అంటున్నారు. ఇప్పటికే థియేటర్స్ తో అగ్రిమెంట్ కూడా జరిగిందని, అవసరం అయితే వాటిని చూపిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటించారు.

పండగ కానుకగా ఈగల్ మూవీ రిలీజ్ కావడం ఖాయం అని చెబుతున్నారు. ఈ సినిమాలో రవితేజకి జోడీగా అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ నటిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, నవదీప్ కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. మరి ఈ సినిమా రవితేజకి ఎలాంటి హిట్ ఇస్తుందనేది చూడాలి.