Begin typing your search above and press return to search.

ఈగల్ 2 ఉంటుందా లేదా..?

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ఈగల్.

By:  Tupaki Desk   |   26 March 2024 4:55 AM GMT
ఈగల్ 2 ఉంటుందా లేదా..?
X

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ఈగల్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా రిలీజ్ విషయంలో జరిగిన హడావిడి తెలిసిందే. సంక్రాంతి సీజన్ లో సినిమా రిలీజ్ చేయాల్సి ఉన్నా ఆ టైం లో చాలా సినిమాలు ఉండటం వల్ల థియేటర్ల సమస్య వస్తుందని భావించి సోలో రిలీజ్ ఇచ్చేలా నిర్మాతల మండలి సర్ధుబాటు చేసింది. అనుకున్నట్టుగానే ఫిబ్రవరి 9న రవితేజ ఈగల్ కు సోలో రిలీజ్ డేట్ వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. కార్తిక్ కథ టేకింగ్ అంతా బాగున్నా ఆడియన్స్ ను ఎంగేజ్ చేయడంలో టార్గెట్ మిస్ అయ్యింది.

అయితే ఈగల్ చూసిన ఆడియన్స్ కు సర్ ప్రైజ్ చేస్తూ ఈగల్ 2 కూడా ప్రకటించారు. ఈగల్ 1 లో కాదు అసలు కథ ఈగల్ 2 లోనే ఉంటుందని హింట్ ఇచ్చారు. ఈగల్ 1 బ్లాక్ బస్టర్ అయితే ఈగల్ 2 మీద ఆసక్తి ఉండేది. ఎప్పుడు వస్తుందా అని ఆడియన్స్ లో ఒక ఎగ్జైట్మెంట్ ఏర్పడేది. కానీ ఈగల్ 1 సినిమానే పెద్దగా ఆడలేదు. అలాంటిది ఈగల్ 2 కోసం ఆడియన్స్ ఆసక్తి చూపించే ఛాన్స్ అసలు లేదు. ఈగల్ సినిమా రెండు భాగాలుగా చెబుతామని ముందే మేకర్స్ ప్రకటించి ఉంటే ఆడియన్స్ కాస్త ఆసక్తితో ఉండే వారేమో కానీ సినిమా చివర్లో పార్ట్ 2 అని ట్విస్ట్ ఇచ్చే సరికి షాక్ అయ్యారు.

ఈగల్ 2 కోసం మళ్లీ నిర్మాతలు కొంత బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ పార్ట్ 1 లో తీసిన రష్ కొంత ఉపయోగపడినా ప్రొడక్షన్ కాస్ట్ అయితే కచ్చితంగా మళ్లీ పార్ట్ 1 కి అయ్యేంత పడుతుంది. సో నిర్మాతల మనసులో ఏముంది అన్నది తెలియాల్సి ఉంది. రవితేజతో ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న టీజీ విశ్వప్రసాద్ మళ్లీ అలాంటి సూపర్ హిట్ కాంబో రిపీట్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అది వర్క్ అవుట్ అవ్వడం లేదు.

ఈగల్ సినిమా కొంతమంది ఆడియన్స్ కు నచ్చినా బాక్సాఫీస్ మీద పెద్దగా ప్రభావం చూపించలేదు. ప్రస్తుతం రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. ఎలాగు పార్ట్ 2 అని ప్రకటించాం కాబట్టి ఈగల్ ను అనుకున్న బడ్జెట్ లో కాకుండా లిమిటెడ్ బడ్జెట్ లో పూర్తి చేసి వదులుతారా.. లేదా అసలు ప్రాజెక్ట్ ని లైట్ తీసుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా రవితేజ కొత్తగా ఏదైనా ట్రై చేస్తే అది ఆడియన్స్ కు రుచించట్లేదు. అందుకే మిస్టర్ బచ్చన్ తన మార్క్ మాస్ అటెంప్ట్ తో వస్తున్నాడు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ జూలైలో రిలీజ్ ప్లానింగ్ ఉందని తెలుస్తుంది.