Begin typing your search above and press return to search.

ఈగల్ ఓటీటీ ఎటాక్.. గెట్ రెడీ!

మార్చి 1వ తేదీన మిడ్ నైట్ 12 గంటల నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   29 Feb 2024 2:38 PM GMT
ఈగల్ ఓటీటీ ఎటాక్.. గెట్ రెడీ!
X

మాస్ మహారాజ రవితేజ నుంచి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఈగల్. యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదట టీజర్ ట్రైలర్స్ తోనే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఐ వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో ఒక డిఫరెంట్ పాయింట్ ను దర్శకుడు హైలెట్ చేశాడు.

ఇక సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా బాగా ఆకట్టుకున్నాయి. థియేటర్లో బాగా సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది. అసలైతే ఈగల్ సినిమాను ఈ ఏడాది మొదట సంక్రాంతి టైమ్ లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అప్పుడు పోటీ ఎక్కువగా ఉండడం అలాగే థియేటర్ల సమస్య కూడా తలెత్తడంతో ఎవరో ఒకరు తప్పుకోవాలనే నిబంధనకు ఈగల్ సినిమా వెనుకడుగు వేసింది.

ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 9వ తేదీన గ్రాండ్ గా విడుదల చేసిన విషయం తెలిసిందే. మాస్ రాజా పోస్టర్స్ తోనే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాడు. యువ దర్శకుడు కార్తీక్ ఈ సినిమాలో రవితేజను చూపించిన విధానం కూడా కొత్తగా అనిపించింది. ఇక ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన ఆడియన్స్ కు చిత్ర యూనిట్ ముందుగానే సర్ ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమయింది.

మార్చి 1వ తేదీన మిడ్ నైట్ 12 గంటల నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే ఈటీవీ విన్ కూడా ఈ సినిమా ఓటీటీ రైట్స్ సొంతం చేసుకుంది. అయితే ముందుగా అమెజాన్ ప్రైమ్ లోనే ఈ సినిమా సందడి చేయబోతోంది. ఈగల్ లో ఎప్పుడూ లేనంత డిఫరెంట్ గెటప్ లో రవితేజ కనిపించాడు.

దీంతో థియేటర్లో చూడని అభిమానులు ఇప్పుడు ఓటీటీలో చూడాలని అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి చర్చలు మొదలయ్యాయి. వెయిటింగ్ అంటూ మాస్ రాజా ఫ్యాన్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. మరి ఈ సినిమా ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.