Begin typing your search above and press return to search.

ఊహించని ఫైట్ లో విజేతగా నిలుస్తాడా..?

మాస్ మహరాజ్ రవితేజ సినిమా అంటే రవితేజ ఫ్యాన్స్ తో పాటుగా కామన్ ఆడియన్స్ కు కూడా సినిమాపై కొన్ని అంచనాలు ఉంటాయి.

By:  Tupaki Desk   |   26 Jan 2024 10:38 AM GMT
ఊహించని ఫైట్ లో విజేతగా నిలుస్తాడా..?
X

మాస్ మహరాజ్ రవితేజ సినిమా అంటే రవితేజ ఫ్యాన్స్ తో పాటుగా కామన్ ఆడియన్స్ కు కూడా సినిమాపై కొన్ని అంచనాలు ఉంటాయి. ప్రస్తుతం మాస్ రాజా ఈగల్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమాను నిర్మాతలంతా కలిసి మాట్లాడుకుని ఫిబ్రవరి 9న రిలీజ్ అయ్యేలా నిర్ణయించారు. అయితే ఆ డేట్ న రవితేజకి సోలో రిలీజ్ ఇస్తారని నిర్మాతలు మాట్లాడుకున్నారు. కానీ సడెన్ గా సందీప్ కిషన్ నటించిన ఊరు పేరు భైరవకోన సినిమా రేసులో వస్తుంది.


సంక్రాంతి టైం లోనే ఫిబ్రవరి 9 రిలీజ్ అయ్యే సినిమాలతో మాట్లాడిన ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఊరు పేరు భైరవకోన టీం ని మర్చిపోయారు. అందుకే వీరు కచ్చితంగా ఆ డేట్ న వచ్చి తీరుతాం అంటున్నారు. మరోపక్క యాత్ర 2 సినిమా రిలీజ్ అవుతుంది. అయితే యాత్ర 2 ఎఫెక్ట్ అంతగా ఉండకపోవచ్చు కానీ ఊరు పేరు భైరవకోన నుంచి ఈగల్ కి త్రెట్ ఉంది.

విఐ ఆనంద్ డైరెక్షన్ లో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ఊరు పేరు భైరవ కోన సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆసక్తికరంగా వస్తుంది. ఈ సినిమా ట్రైలర్ కూడా ఇంప్రెస్ చేసింది. అయితే ఈ సినిమా వల్ల ఈగల్ మీద ఎఫెక్ట్ పడుతుంది అన్నది ఆలోచించాల్సి ఉంది. ఐతే సంక్రాంతికి పెద్ద సినిమాల మధ్య రిలీజ్ చేయాలని అనుకున్న ఈగల్ టీం సందీప్ కిషన్ సినిమాను పోటీ అనుకోవడం విచిత్రంగా ఉంది. ఒకవేళ సందీప్ సినిమా హిట్ టాక్ వచ్చినా ఈగల్ దానికి తగినట్టు ఉంటే రెండు సినిమాలు మంచి ఫలితాలు తెచ్చుకునే ఛాన్స్ ఉంది.

ఈ సినిమాల ఫైట్ లో మాస్ మహారాజ్ రవితేజ మరోసారి తన మాస్ స్టామినా చూపించాల్సి ఉంది. సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో గుంటూరు కారం మొదట టాక్ బాగా లేకపోయినా మహేష్ తన చరిష్మాతో లాక్కొచ్చేశాడు. అయితే రవితేజ ఈగల్ సినిమా డైరెక్ట్ హిట్ టాక్ వస్తే ఓకే అలా కాకపోతే మాత్రం రవితేజ స్టామినాకు అసలు సిసలైన టెస్ట్ అని చెప్పొచ్చు. రవితేజ వర్సెస్ సందీప్ కిషన్ ఈ క్రేజీ ఫైట్ ఇండస్ట్రీ పీపుల్ ని కూడా ఆశ్చర్యపరుస్తోంది. రెండు కంటెంట్ బేస్డ్ సినిమాలు కాబట్టి రెండిటి మీద మంచి అంచనాలు ఉన్నాయి.