Begin typing your search above and press return to search.

రవితేజ క్రేజీ అవతార్.. గ్రాండ్ విజువల్స్ తో ఇంగ్లీష్ సాంగ్

ఇప్పటికే ఈ సినిమా నుంచి ఆడు మచ్చా ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ కాగా.. మ్యూజిక్ లవర్స్ ను ఎంతో ఆకట్టుకుంది

By:  Tupaki Desk   |   26 Jan 2024 8:28 AM GMT
రవితేజ క్రేజీ అవతార్.. గ్రాండ్ విజువల్స్ తో ఇంగ్లీష్ సాంగ్
X

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా.. పండక్కి పోటీ ఎక్కువ ఉండడంతో రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గారు మేకర్స్. సోలో రిలీజ్ డేట్ కేటాయిస్తామని ఫిల్మ్ ఛాంబర్ హామీ ఇవ్వడంతో ఫిబ్రవరి 9న విడుదల చేస్తామని ప్రకటించారు. ఇక రిలీజ్ డైట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్లను స్టార్ట్ చేశారు మేకర్స్.


ఇప్పటికే ఈ సినిమా నుంచి ఆడు మచ్చా ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ కాగా.. మ్యూజిక్ లవర్స్ ను ఎంతో ఆకట్టుకుంది. మూవీలోని ఓ జాతర సందర్భంగా ఈ పాట ఉండనుందని లిరికల్ వీడియో చూస్తే అర్థమవుతోంది. జాతర సెటప్‍ లో ఫుల్ మాస్ గెటప్‍ లో రవితేజ వేసిన స్టెప్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ మరో సాంగ్ ను విడుదల చేశారు.

రిపబ్లిక్ డేతోపాటు రవితేజ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్.. ఈగల్ ఆన్ హిజ్ వే అంటూ సాగిన సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాట.. సినిమాలో రవితేజ క్యారెక్టర్ ను రివీల్ చేస్తోంది. చేతిలో సూపర్ గన్ తో ఓ క్రేజీ అవతార్ లో మాస్ మహారాజా కనిపిస్తున్నారు. విజువల్స్ కూడా అదిరిపోయాయి. సాంగ్ మొత్తం ఇంగ్లీష్ లోనే సాగగా.. జార్చినా మథ్యూ లిరిక్స్ తోపాటు గాత్రాన్ని అందించారు. మొత్తానికి ఈ పాట సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది.

ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌ అయిన కార్తీక్‍ కు డైరెక్టర్‌గా ఇది రెండో మూవీ. మల్టిపుల్ షేడ్స్ ఉన్న రోల్ లో నటిస్తున్న రవితేజ సరసన కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, అజయ్ ఘోష్ కీలక పాత్రలను పోషిస్తున్నారు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మరో ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు మణిబాబు కరణం డైలాగ్స్ అందిస్తున్నారు. ఈగల్ మూవీ అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ తోపాటు హిందీలోనూ మరో రెండు వారాల్లో రిలీజ్ కానుంది.