Begin typing your search above and press return to search.

'ఈగల్'.. హిందీలో డిఫరెంట్ టైటిల్ తో అదే టీజర్

ఈగల్ ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. సినిమాని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి కానుకగా జనవరి 13న మరోసారి ఈ హిందీ టీజర్ తో మూవీ టీం స్పష్టం చేసింది.

By:  Tupaki Desk   |   15 Dec 2023 3:55 PM GMT
ఈగల్.. హిందీలో డిఫరెంట్ టైటిల్ తో అదే టీజర్
X

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న 'ఈగల్' మూవీ నుంచి ఓ బ్లాస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. ఎవరు ఊహించని విధంగా ఈ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటిస్తూ హిందీ టీజర్ ని విడుదల చేశారు. అంతేకాదు ఈగల్ మూవీని హిందీ లో 'సహదేవ్' అనే పేరుతో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ మూవీ టీం 'సహదేవ్' టైటిల్ తో టీజర్ రిలీజ్ చేసింది. రీసెంట్ గా తెలుగులో రిలీజ్ చేసిన టీజర్ ని హిందీలో టైటిల్ మార్చి డబ్ చేసి రిలీజ్ చేశారు.


ఈగల్ ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. సినిమాని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి కానుకగా జనవరి 13న మరోసారి ఈ హిందీ టీజర్ తో మూవీ టీం స్పష్టం చేసింది. ఈగల్ మేకర్స్ నుంచి ఇలాంటి స్టెప్ ఊహించనేలేదు. రవితేజ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు హిందీలో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తుండడం విశేషం. రవితేజ గత చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు' పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయింది.

స్వయంగా రవితేజ నార్త్ లో ఈ మూవీ ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో చేశాడు. కాకపోతే టైగర్ నాగేశ్వరరావు కి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ దక్కలేదు. నిజానికి హిందీలో రవితేజ కి భారీ మార్కెట్ ఉంది. ఆయన నటించిన సినిమాలన్నీ హిందీలో డబ్ అయి యూట్యూబ్లో రిలీజ్ అవుతుంటాయి. రవితేజ నటించిన చాలా సినిమాలు హిందీ డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్లో మిలియన్ల కొద్ది వ్యూస్ అందుకున్నాయి. దాంతో నార్త్ లోనూ రవితేజ కి మంచి క్రేజ్ వచ్చింది.

ఇప్పుడు ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకొనేందుకు ఈగల్ నిర్మాతలు సినిమాని తెలుగు తో పాటు హిందీలో కూడా విడుదల చేస్తున్నారు. మరి 'ఈగల్' హిందీ వెర్షన్ 'సహదేవ్' నార్త్ లో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీతో ప్రముఖ సినిమాటోగ్రఫర్ కార్తిక్ ఘట్టమనేని డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో డార్క్ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నవదీప్, అవసరాల శ్రీనివాస్, వినయ్ రాయ్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.