Begin typing your search above and press return to search.

రవితేజ ఈగల్.. ఫిబ్రవరి డేంజరే రాజా

అయితే ఈగల్ మూవీ రిలీజ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు గతకొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   5 Jan 2024 11:07 AM IST
రవితేజ ఈగల్.. ఫిబ్రవరి డేంజరే రాజా
X

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్‌ ఘట్టమనేని తెరకెక్కించిన ఈగల్ సినిమా.. సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక సంక్రాంతి బరిలో మహేశ్ గుంటూరు కారం, వెంకటేశ్ సైంధవ్, నాగార్జున నా సామిరంగా, తేజ సజ్జ హనుమాన్ దిగనున్నాయన్న మాట.

అయితే ఈగల్ మూవీ రిలీజ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు గతకొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ వాటిని చిత్ర యూనిట్ ఖండిస్తూ వచ్చింది. కచ్చితంగా సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెప్పింది. కానీ నిర్మాత మండలితో చర్చల అనంతరం వాయిందా వేసింది. ఫిబ్రవరి 9వ తేదీని సోలోగా విడుదల చేయనున్నామని ప్రకటించింది.

సంక్రాంతికి ఈగల్ సినిమా రిలీజ్ వాయిదా పక్కనపెడితే.. ఇప్పుడు కొత్త విడుదల తేదీపై రవితేజ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవితేజ సినిమాలకు ఫిబ్రవరి నెల కలిసి రాదని అంటున్నారు. అందుకు గతంలో ఆయన నటించిన నాలుగు సినిమాల ఫలితాలను ఉదాహరణగా చూపుతున్నారు.

ర‌వితేజ న‌టించిన షాక్, నిప్పు, ట‌చ్ చేసి చూడు, ఖిలాడి సినిమాలు ఫిబ్ర‌వ‌రిలోనే రిలీజ్ అయ్యాయి. ఈ నాలుగు సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. ఇప్పుడు కొత్త సినిమా ఈగ‌ల్ కూడా ఫిబ్ర‌వ‌రిలోనే రిలీజ్ అవుతోంది. ఆ నాలుగు సినిమాల్లా కాకుండా ఈగల్ బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫిబ్ర‌వ‌రి బ్యాడ్ సెంటిమెంట్ కు రవితేజ బ్రేక్ ఇవ్వాలని అంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజతోపాటు అనుపమ పరమేశ్వరన్, కావ్య తాపర్ లీడ్ రోల్స్ లో నటించారు. నవదీప్, అవసరాల శ్రీనివాస్, వినయ్ రాయ్, సునీల్ కీలక పాత్రలు పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల సంయుక్తంగా నిర్మించారు. 2023 స్టార్టింగ్ లో చిరంజీవి వాల్తేరు వీరయ్యలో గెస్ట్ రోల్ లో అలరించిన రవితేజ.. ఆ తర్వాత టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర మూవీలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ అవి నిరాశపరిచాయి. మరి సినిమా ఎలాంటి ఫలితమందిస్తుందో రవితేజకి.