Begin typing your search above and press return to search.

ఈగల్ × భైరవకోన.. సోలో డేటా? ఫైటా?

ఇదే విషయం మీద తాజాగా ఒక ప్రెస్ మీట్ లో ప్రశ్నిస్తే తమను అసలు ఎవరూ అడగలేదని.. ఇప్పుడు రిలీజ్ వాయిదా వేయడం కష్టమేనని హీరో సందీప్ కిషన్ చెప్పుకొచ్చారు.

By:  Tupaki Desk   |   25 Jan 2024 12:16 PM GMT
ఈగల్ × భైరవకోన.. సోలో డేటా? ఫైటా?
X

ఈ ఏడాది సంక్రాంతి బరి నుంచి తప్పుకునేందుకు రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమాకు ఫిల్మ్ ఛాంబర్ సోలో రిలీజ్ డేట్ ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 9వ తేదీన తమ సినిమా రిలీజ్ చేసుకుంటామని ఈగల్ చిత్రయూనిట్ చెప్పడంతో ఆ రోజు షెడ్యూల్ చేసుకున్న టిల్లు స్క్వేర్ మేకర్స్ తమ మూవీని వాయిదా వేసినట్టు అధికారికంగా ప్రకటించారు.

అయితే అదే రోజు సందీప్ కిషన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఊరి పేరు భైరవకోన రిలీజ్ ఉందనే సంగతి ఫిల్మ్ ఛాంబర్ మర్చిపోయిందేమో! దీంతో భైరవకోన మేకర్స్.. ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. ఇదే విషయం మీద తాజాగా ఒక ప్రెస్ మీట్ లో ప్రశ్నిస్తే తమను అసలు ఎవరూ అడగలేదని.. ఇప్పుడు రిలీజ్ వాయిదా వేయడం కష్టమేనని హీరో సందీప్ కిషన్ చెప్పుకొచ్చారు.

మరోవైపు, తమకు హామీ ఇచ్చిన విధంగా సోలో రిలీజ్ డేట్ ఇచ్చేందుకు ప్రయత్నించాలని ఈగల్ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఫిల్మ్ ఛాంబర్ కు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ రంగంలోకి దిగి ఊరు పేరు భైరవకోన సినిమా నిర్మాణ సంస్థ హాస్య ఎంటర్టైన్మెంట్స్ తో పాటు అనిల్ సుంకరతో మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే తాము మాత్రం వెనక్కి వెళ్లాల్సి వస్తే కచ్చితంగా తమకు కూడా సోలో రిలీజ్ కావాల్సిందేనని అనిల్ సుంకర పేర్కొన్నట్లు సమాచారం.

ఒకవేళ.. ఊరి పేరు భైరవకోన సినిమా వాయిదా పడినా సరే ఫిబ్రవరి 8వ తేదీన యాత్ర 2 సినిమా రిలీజ్ అవుతుంది. ఈ మూవీపై ఈగల్ టీమ్ కు ఎలాంటి ఇబ్బంది లేదట. లాల్ సలాం సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవ్వనుంది. కానీ అందులో సూపర్ స్టార్ రజనీకాంత్ క్యామియో రోల్ కాబట్టి ఈగల్ మేకర్స్ లైట్ తీసుకుంటున్నారట. భైరవకోన ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. అందుకే ఈగల్ చిత్రయూనిట్ టెన్షన్ పడుతుందట. కచ్చితంగా సోలో రిలీజ్ డేట్ కావాలని పట్టుబడుతోందట.

ఇప్పుడు భైరవకోన, ఈగల్ రిలీజ్ డేట్ ల ఇష్యూపై నేడు జరగనున్న ఛాంబర్ మీటింగ్ లో ప్రధానంగా చర్చించబోతున్నారట. చాలా నెలల క్రితం రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సందీప్ కిషన్ మూవీని వాయిదా వేయమనడం కరెక్ట్ కాదని నిర్మాతలు భావిస్తున్నారట. ఒకవేళ పోస్ట్ పోన్ వేయమని కోరినా.. దగ్గర్లో సోల్ రిలీజ్ డేట్ లేదు. తారక్ నటిస్తున్న దేవర పోస్ట్ పోన్ అవుతుందని వార్తలు వస్తున్నా.. ఏప్రిల్ 5పై ఫ్యామిలీ స్టార్, టిల్లు స్క్వేర్ మేకర్స్ కన్నేశారు. దీంతో ఛాంబర్ మీటింగ్ లో ఊరి పేరు భైరవకోన, ఈగల్ రిలీజ్ డేట్ లపై నేడు జరిగే చర్చలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.