Begin typing your search above and press return to search.

OG - అసలు టెన్షన్ అక్కర్లే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ లో డిఫరెంట్ సినిమాలు ఎన్ని ఉన్నా కూడా అందరి ఫోకస్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న OG పైనే ఉంది

By:  Tupaki Desk   |   3 April 2024 7:09 PM GMT
OG - అసలు టెన్షన్ అక్కర్లే!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ లో డిఫరెంట్ సినిమాలు ఎన్ని ఉన్నా కూడా అందరి ఫోకస్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న OG పైనే ఉంది. పవర్ స్టార్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుళ్ మోహన్ పవన్ కళ్యాణ్ కి జోడీగా నటిస్తోంది. ఇక ఓజీ మూవీపై రోజుకో టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ముఖ్యంగా సినిమాను అనుకున్న టైమ్ కు విడుదల చేస్తారా లేదా అనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. పవన్ తో ఇంకొన్ని మేజర్ సీన్స్ ఫినిష్ చేయాల్సి ఉంది. రెండు వారాల టైమ్ ఇస్తే జెట్ స్పీడ్ లో ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. పవన్ ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. జూన్ తరువాత OG షూట్ ని పూర్తి చేసే అవకాశం ఉంది.

ఇక సినిమాను అనుకున్న ప్లాన్ ప్రకారం సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తారా లేదా అనే డౌట్స్ వస్తుండగా మరోసారి నిర్మాత దానయ్య క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రీసెంట్ గా గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా ట్రైలర్ లాంచ్ లో పాల్గొన్న ఆయన ఓజి సినిమా విడుదల తేదీపై కూడా వివరణ ఇచ్చారు. సినిమా మళ్లీ వాయిదా పడుతుందని వచ్చే వార్తల్లో ఎలాంటి నిజం లేదని సెప్టెంబర్ లో కరెక్ట్ సమయానికి సినిమా రాబోతున్నట్లు వివరణ ఇచ్చేశారు.

అయితే పవన్ కళ్యాణ్ తెలుగులో బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలిచిన సినిమా లలో అత్తారింటికి దారేది ఒకటి. ఆ సినిమా కూడా 2013 లో సెప్టెంబర్ 27న విడుదల అయింది ఇక ఇప్పుడు OG కూడా అదే డేట్ ఫిక్స్ చేసుకోవడంతో ఫ్యాన్స్ లో ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. తప్పకుండా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరి కొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని భావిస్తున్నారు. మొత్తానికి రిలీజ్ డేట్ విషయంలో టెన్షన్ అక్కర్లేదు అని నిర్మాత క్లారిటీ ఇచ్చేశారు.

ఓజీ మూవీ స్టోరీ లైన్ పై కూడా చాలా రకాల గాసిప్స్ పుట్టుకొచ్చాయి. ఇదివరకే గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ముంబై బ్యాక్ డ్రాప్ లో స్టోరీ నడుస్తుందని క్లారిటీ వచ్చేసింది. ఇక ముంబై మాఫియా గ్యాంగ్ స్టార్స్ అందరికి లీడర్ గా ఉండే ఒజాస్ గంబీరా కొంత కాలానికి క్రైమ్ కు దూరంగా ఉంటాడు. అనంతరం మరల మాఫియాలోకి అడుగుపెట్టి తన శత్రువులు అందరిపై రివెంజ్ తీర్చుకుంటే ఎలా ఉంటుంది అనే స్టొరీ లైన్ తో సినిమా ఉంటుందని టాక్. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.