Begin typing your search above and press return to search.

దుమ్ము దులిపేసిన‌ బిగ్ బాస్ బ్యూటీ

త‌న‌దైన‌ ఫ్యాషన్ సెన్స్ .. ప‌వ‌ర్ ప్యాక్డ్స్ పెర్ఫామెన్సెస్‌తో ప్రియా చౌద‌రి పాపుల‌రైంది.

By:  Tupaki Desk   |   19 Nov 2023 10:23 AM GMT
దుమ్ము దులిపేసిన‌ బిగ్ బాస్ బ్యూటీ
X

హిందీ బిగ్ బాస్ వేదిక‌గా ఎంతో మంది ప్ర‌తిభావంతులు బాలీవుడ్ లో ప్ర‌వేశించారు. న‌ట‌నా రంగంలో ఎదిగారు. ఇప్పుడు అదే కేట‌గిరీలో మ‌రో భామ వేవ్స్ క్రియేట్ చేయ‌బోతోంది. ఈ భామ పేరు ప్రియాంక చౌద‌రి. ఈ అంద‌గ‌త్తె ప్ర‌తిభ లుక్స్ కి బిగ్ బాస్ ఇంటిలో బోలెడంత ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ప్రియాంక చౌదరి బిగ్ బాస్ ట్రోఫీని గెలుచుకోకపోవచ్చు.. కానీ క‌చ్చితంగా దేశం హృదయాన్ని గెలుచుకోగలిగింది. త‌న‌దైన‌ ఫ్యాషన్ సెన్స్ .. ప‌వ‌ర్ ప్యాక్డ్స్ పెర్ఫామెన్సెస్‌తో ప్రియా చౌద‌రి పాపుల‌రైంది.


ప్రియాంక ఇటీవల బోల్డ్ ఫోటోషూట్ కి సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో అగ్గి రాజేసాయి. నెటిజనులు తమ ప్రశాంతతను కోల్పోయారు. ప్రియా అభిమానులు సోష‌ల్ మీడియా అనుచరులు మాత్రమే కాదు.. పరిశ్రమ ప్రజలు కూడా ఈ ఫోటోలపై ఫైర్ ఈమోజీల‌తో విరుచుకుపడుతున్నారు. అంత‌గా ప్రియా హాట్ లుక్ నెటిజ‌నుల‌కు క‌నెక్ట‌యింది.


ప్రియాంక బోయ్ ఫ్రెండ్, `ఉడారియన్` సహనటుడు అంకిత్ గుప్తా ఈ ఫోటోల‌పై ఘాటైన వ్యాఖ్య‌ను జోడించారు. ``హాట్‌నెస్ మచా రాఖీ హై తుమ్నే (ఫైర్ ఎమోజీలు)`` అని రాశారు. చౌదరి గాళ్ BB సహ-కంటెస్టెంట్ టీనా దత్తా ఇలా రాశారు, ``లాగ్ గాయీ మెయిన్ బాతా రహీ హున్ ఆగ్ లాగ్ గయీ మేరే ఇన్‌స్టా పే`` అని వ్యాఖ్యానించ‌గా, దల్జీత్ కౌర్ ఇలా రాశారు. ``క్లాస్ వేరు! అద్భుతమైన ఫోటోలు`` అని వ్యాఖ్యానించారు. ప్రియాంక‌ ఫోటోలపై పలువురు సెలబ్రెటీలు తమ వ్యాఖ్య‌ల‌ను జోడించి ఫైర్ ఈమోజీల‌ను షేర్ చేసారు.


అయితే ప్రియాంక బోల్డ్ ఫోటోషూట్ చూసి చాలా మంది అవాక్కయ్యారు. ``మీ నుండి ఇది ఊహించలేదు`` అని ఒక నెటిజ‌న్ రాశారు. షెహనాజ్ గిల్‌ను అనుసరించవద్దని కొందరు ప్రియాంక చౌద‌రిని కోరగా, అలాంటి దుస్తులు ధరించవద్దని చాలా మంది సలహా ఇచ్చారు.

అంకిత్ పెళ్లికి తెరలేపిన ప్రియాంక

అంకిత్ గుప్తా ఇప్పుడు పెళ్లికి సిద్ధంగా ఉన్నాడని ఒక ఇంటర్వ్యూలో తెలియగానే, ప్రియాంక ఇలా చెప్పింది, ``ఓహ్, యే ఇంటర్వ్యూ మైనే క్యు న్హీ దేఖా? ఎందుకంటే అతడు వివాహానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి. ఫర్వాలేదు... నేను నమ్ముతున్నాను. అగర్ ఐసే కుచ్ హై , నేను అతనితో మాట్లాడబోతున్నాను. అతడిని అడగబోతున్నాను- తుమహరే విచార్ కైసే బదల్ గయే?`` అని వ్యాఖ్యానించింది.