Begin typing your search above and press return to search.

దసరాకి టీజర్స్, ట్రైలర్స్ జోరు

వాటిలో నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న టీజర్, విక్టరీ వెంకటేష్ పాన్ ఇండియా మూవీ సైంధవ్ టీజర్ రిలీజ్ కాబోతున్నాయి.

By:  Tupaki Desk   |   13 Oct 2023 4:20 AM GMT
దసరాకి టీజర్స్, ట్రైలర్స్ జోరు
X

ఈ దసరాకి నాలుగు భాషల నుంచి ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కన్నడం నుంచి శివరాజ్ కుమార్ ఘోస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రిలీజ్ కాబోతోంది. కోలీవుడ్ నుంచి లియో మూవీ రెడీ అవుతోంది. బాలీవుడ్ నుంచి గణపత్ మూవీ రాబోతోంది. ఇక తెలుగు నుంచి భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీస్ థియేటర్స్ లో సందడి చేయబోతున్నాయి.

దీంతో ఆడియన్స్ ని కావాల్సినంత సినిమా సందడి దసరా సెలవుల్లో ఉండబోతోంది. అయితే ఈ సినిమాల సంగతి అలా ఉంటే త్వరలో రిలీజ్ కాబోయే సినిమాలకి సంబందించిన టీజర్స్, ట్రైలర్స్ కూడా దసరా సర్ప్రైజ్ గా రాబోతున్నాయి. వాటిలో నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న టీజర్, విక్టరీ వెంకటేష్ పాన్ ఇండియా మూవీ సైంధవ్ టీజర్ రిలీజ్ కాబోతున్నాయి.

బాలీవుడ్ నుంచి యష్ రాజ్ స్పై సిరీస్ లో వస్తోన్న టైగర్ 3 మూవీ దీపావళికి రిలీజ్ కాబోతోంది. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ లీడ్ చేసిన ఈ మూవీ టీజర్ ని దసరా కానుకగా అందించబోతున్నారు. అలాగే దిల్ రాజు బ్యానర్ లో పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తోన్న ఫ్యామిలీ స్టార్ మూవీ టైటిల్ లాంచ్ టీజర్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

అలాగే గేమ్ చేంజర్ నుంచి ఫస్ట్ సింగిల్ కూడా దసరాకి రాబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ని దసరాకి లాంచ్ చేయబోతున్నారని టాక్. ఇలా దసరాకి సినిమా వినోదంగా ఆడియన్స్ కి కావాల్సినంత లభిస్తోంది. వీటితో పాటు ఒటీటీలో కూడా దసరా కానుకగా చాలా కొత్త సినిమాలు రాబోతున్నాయి.

మరి వీటిలో ఏవి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తాయనేది వేచి చూడాలి. మూవీస్ పరంగా చూసుకుంటే దేనికవే ప్రత్యేకమైనవి. అన్నింటి మీద పాజిటివ్ వైబ్ నడుస్తోంది. లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలలో ఒకటి మాత్రం ఆడియన్స్ ని బలంగా ఎట్రాక్ట్ చేసే అవకాశం ఉంది.