Begin typing your search above and press return to search.

డంకీ సెన్సార్, స్టోరీ.. రన్ టైమ్ ఎంతంటే

దీంతో ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియిలు ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

By:  Tupaki Desk   |   16 Dec 2023 9:52 AM GMT
డంకీ సెన్సార్, స్టోరీ.. రన్ టైమ్ ఎంతంటే
X

పఠాన్, జవాన్ బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన చిత్రం డంకీ. స్టార్ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఈ మూవీకి సంబంధించి వరుస ప్రమోషన్ కార్యక్రమాలతో షారుక్, రాజ్ హిరాణీ అదరగొట్టారు. డంకీ డ్రాప్స్ పేరుతో వరుసగా ప్రోమోలు, ట్రైలర్, పాటలను రిలీజ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియిలు ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

రూ.120 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు పెద్ద ఎత్తునే భారీ ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిందంట. తాజాగా డంకీ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది.ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 41 నిమిషాలుగా సమాచారం. వలస బతుకుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలిసింది.

సినిమా స్టోరీ ఇదే

పంజాబ్ లోని ఓ చిన్న పట్టణంలో ముగ్గురు యువకులు, ఓ యువతి సామాజిక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాళ్ల జీవితాశయం, కల ఒకటే. వాళ్ల కల నెరవేర్చడానికి ఓ రిటైర్డ్ సైనికుడు ముందుకు వస్తాడు. ఇంగ్లాండ్ చేరుస్తానని మాట ఇస్తాడు. అలా మొదలైన వారి ఇంగ్లాండ్ ప్రయాణం, ఆ ప్రయాణంలో వారు ఎదుర్కొన్న సమస్యలు, స్నేహం, ప్రేమ, కుటుంబం చుట్టూ జరిగేది మిగిలిన కథ.

మరోవైపు, భారత్ లో డంకీ అడ్వాన్స్ బుకింగ్స్ అతి త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఓవర్సీస్ లో ఇప్పటికే ప్రీ బుకింగ్స్ ప్రారంభమవ్వగా.. జోరుగా సాగుతున్నాయి. షారుక్ కు హ్యాట్రిక్ హిట్ ఖాయమని ఫ్యాన్స్ చెబుతున్నారు. బాలీవుడ్ కు ఇది మరో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అవుతుందని అంతా భావిస్తున్నారు.

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, రాజ్ కుమార్ హిరాణీ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. తాప్సీ పొన్ను, విక్కీ కౌశల్, బోమన్ ఇరాణీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఎడిటింగ్ బాధ్యతలను స్వయంగా రాజ్ కుమార్ హిరాణీ తీసుకున్నారు. ప్రీతమ్, అమన్ పంత్ మ్యూజిక్ అందిస్తున్నారు.

అయితే రియలిస్టిక్ కథలను సినీ ప్రజలకు నచ్చేట్టుగా తెరకెక్కించడంలో డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ దిట్ట అని చెప్పవచ్చు. దీంతో ఈ సినిమా కూడా భారీ విజయం సాధించడం పక్కా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ప్రేక్షకుల అంచనాలను డంకీ సినిమా అందుకుంటుందా? లేదా? అనేది తెలియాలంటే డిసెంబర్ 21 వరకు ఆగాల్సిందే.