Begin typing your search above and press return to search.

ఆస్కార్ కి షారుక్ సినిమా.. ఆ అర్హత ఉందా?

సరిగ్గా ఈ సినిమా రిలీజ్ టైం లో టాలీవుడ్ నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ 'సలార్' కూడా రిలీజ్ అయింది

By:  Tupaki Desk   |   12 Jan 2024 12:30 AM GMT
ఆస్కార్ కి షారుక్ సినిమా.. ఆ అర్హత ఉందా?
X

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గత ఏడాది ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు 2023 ఆరంభంలో 'పఠాన్' విడుదలవగా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్లు కొల్లగొట్టింది. ఆ తర్వాత వచ్చిన 'జవాన్' సైతం మరో వెయ్యి కోట్ల మార్క్ అందుతుంది. ఇక ఇయర్ ఎండింగ్ లో వచ్చిన 'డంకీ' మొదటి రెండు సినిమాల రేంజ్ లో వసూళ్లు రాబట్టకపోయినా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో పరవాలేదు అనిపించుకుంది.

సరిగ్గా ఈ సినిమా రిలీజ్ టైం లో టాలీవుడ్ నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ 'సలార్' కూడా రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాల మధ్య భారీ క్లాష్ తో కలెక్షన్స్ పై ప్రభావం పడింది. కాకపోతే బడ్జెట్ వైజ్ చూసుకుంటే 'డంకీ' మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది. బాలీవుడ్ స్టార్ ఫిలిం మేకర్ రాజ్ కుమార్ హిరాని తెరకెక్కించిన ఈ కామెడీ డ్రామాకి కేవలం రూ.85 కోట్ల బడ్జెట్ మాత్రమే ఖర్చు చేశారు. అది కూడా హీరో దర్శకుడు, రెమ్యునరేషన్స్ తీసేసి.

ఇక సినిమాకి రూ.240కోట్ల నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక రిలీజ్ తర్వాత ఫుల్ రన్ లో రూ.450 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ కి వెళ్లబోతుందనే న్యూస్ బయటకు వచ్చింది. 'డంకీ' ఈ ఏడాది ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీ గా ఆస్కార్ నామినేషన్ కి వెళ్లే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల గుసగుసలాడుకుంటున్నాయి.

ఇప్పటికే మూవీ టీం ఆస్కార్ కి తమ రిక్వెస్ట్ ను పంపించినట్లు సమాచారం. ఈ సినిమా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. ఇది యూనివర్సల్ సబ్జెక్టు కావడం, ఈ సబ్జెక్ట్ ని రాజ్ కుమార్ హిరాని ఎంతో ఎమోషనల్ గా డీల్ చేయడంతో షారుక్ ఖాన్ ఫ్యాన్స్ తో పాటు బాలీవుడ్ ఆడియన్స్ ఈ సినిమాని ఆస్కార్ నామినేషన్ కోసం పంపాలని భావిస్తున్నట్లు తెలిసింది. కాగా ఈ న్యూస్ కి సోషల్ మీడియా నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

'డంకీ' ఆస్కార్ కి వెళ్లడం పట్ల అభిమానులు ఓ వర్గం ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తుంటే, గత సంవత్సరం రిలీజ్ అయిన సినిమాల్లో ఇంతకంటే మంచి సినిమాలు ఉన్నాయని కొందరు అంటున్నారు. మరి 'డంకీ' నిజంగానే ఆస్కార్ నామినేషన్ కి వెళ్లబోతుందా? షారుఖ్ సినిమాకి ఆస్కార్ కి వెళ్లే అర్హత ఉందా? అనేది తెలియాలంటే దీనిపై పూర్తి స్పష్టత వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.