Begin typing your search above and press return to search.

డంకీ.. ఆదిపురుష్ ను కూడా దాటిపోలేదు..

సలార్ వర్సెస్ డంకీ.. ప్రశాంత్ నీల్ వర్సెస్ రాజ్ కుమార్ హిరాణీ.. గత కొద్దిరోజులుగా సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఇదే టాపిక్

By:  Tupaki Desk   |   23 Dec 2023 6:37 AM GMT
డంకీ.. ఆదిపురుష్ ను కూడా దాటిపోలేదు..
X

సలార్ వర్సెస్ డంకీ.. ప్రశాంత్ నీల్ వర్సెస్ రాజ్ కుమార్ హిరాణీ.. గత కొద్దిరోజులుగా సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఇదే టాపిక్. ఇప్పుడు రెండు సినిమాలు బాక్సాఫీస్ ముందుకు వచ్చేశాయి. డిసెంబర్ 21వ తేదీన షారుక్ డంకీ ప్రేక్షకుల ముందుకు రాగా.. డిసెంబర్ 22వ తేదీన ప్రభాస్ సలార్ వచ్చింది. అయితే సౌత్ మూవీ అయిన సలార్.. బీటౌన్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని సినిమా రిలీజ్ ల ముందు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు.

2023లో పఠాన్, జవాన్ సూపర్ హిట్ల తర్వాత షారుక్ నటించిన డంకీ మూవీ.. తొలి రోజే సలార్ ను బ్రేక్ చేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావించారు. కానీ ఇప్పుడు వారి అంచనాలంతా తలకిందులయ్యాయని అని టాక్ వస్తోంది. సలార్ ను బీట్ చేయడం పక్కన పెడితే.. అసలుకే మోసం వచ్చిందని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.

సలార్ కన్నా ముందు ప్రభాస్ నటించిన మైథిలాజదికల్ మూవీ ఆదిపురుష్.. ట్రైలర్ రిలీజ్తోనే డిజాస్టర్ టాక్తో చతికిలపడింది. సినిమా కూడా ఫ్లాప్ టాక్ అందుకుంది. అయినా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.130 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్లో దాదాపు రూ.45కోట్లకుపైగా గ్రాస్ రాబట్టింది.

ఇప్పుడు డంకీ బాలీవుడ్ మూవీనే కానీ హిందీ రీజియన్లో కేవలం రూ.38కోట్లే వసూలు చేసింది. వరల్డ్వైడ్గా రూ.58 కోట్లే వసూలు చేసిందట. ప్రభాస్ సలార్ మూవీని డంకీ డామినేట్ చేస్తుందనుకుంటే ఇప్పుడు రివర్స్ అయిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారట. కనీసం డార్లింగ్ డిజాస్టర్ మూవీ ఆదిపురుష్ వసూళ్ల కన్న తక్కువ రాబట్టిందని అంటున్నారు. మరోవైపు, సలార్ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.175 కోట్లకుపై వసూళ్లు రాబట్టింది.

వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన సలార్ మూవీకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాని హోంబలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ సుమారు రూ.400 కోట్ల బడ్జెట్ తో నిర్మించింది. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో పృధ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, బాబీ సింహ, ఈశ్వరి రావ్, శ్రియ రెడ్డి, టీనూ ఆనంద్, సప్తగిరి, బ్రహ్మాజీ, కమెడియన్ పృథ్వీ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

మరోవైపు, ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, రాజ్ కుమార్ హిరాణీ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా డంకీ మూవీని రూపొందించారు. తాప్సీ పొన్ను, విక్కీ కౌశల్, బోమన్ ఇరాణీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఎడిటింగ్ బాధ్యతలను స్వయంగా రాజ్ కుమార్ హిరాణీ తీసుకున్నారు. ప్రీతమ్, అమన్ పంత్ మ్యూజిక్ అందించారు. కానీ రెండు సినిమాల్లో సలార్ దే పై చేయిని అభిమానులు చెబుతున్నారు!