Begin typing your search above and press return to search.

డుంకీ కాన్సెప్ట్‌తో పోలిక ఉన్న మ‌రో సినిమా

ఒకే కాన్సెప్టుతో రెండు సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌స్తే ఆ రెండిటి మ‌ధ్యా పోలిక చూడ‌టం స‌హ‌జం. ఎవ‌రు ముందుగా వ‌స్తే వారికి ప్రేక్ష‌కుల్లో గురి కుదురుతుంది.

By:  Tupaki Desk   |   2 Oct 2023 12:30 PM GMT
డుంకీ కాన్సెప్ట్‌తో పోలిక ఉన్న మ‌రో సినిమా
X

ఒకే కాన్సెప్టుతో రెండు సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌స్తే ఆ రెండిటి మ‌ధ్యా పోలిక చూడ‌టం స‌హ‌జం. ఎవ‌రు ముందుగా వ‌స్తే వారికి ప్రేక్ష‌కుల్లో గురి కుదురుతుంది. ఆల‌స్య‌మైన సినిమాకి పోలిక‌లు చూస్తారు. ఇప్పుడు ఒకే కాన్సెప్టుతో ఇరువురు అగ్ర హీరోలు న‌టించిన‌ రెండు సినిమాలు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

షారూఖ్ ఖాన్ డుంకీ - దుల్కర్ సల్మాన్ CIA సారూప్యతపై ర‌క‌ర‌కాల‌ ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ రెండిటి క‌థ‌క‌మామీషు.. స్క్రీన్ ప్లే న‌డ‌క న‌డ‌త వ‌గైరా అంశాలు ఒకేలా ఉండే వీలుంద‌ని టాక్ వినిపించ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. దుల్కార్ న‌టించిన‌ 'కామ్రేడ్ ఇన్ అమెరికా' 2017లో విడుద‌లైంది. ఈ సినిమా క‌థాంశంతో డుంకీ క‌థాంశం పోలి ఉంద‌ని ఊహిస్తున్నారు.

డిసెంబర్ 22న షారుఖ్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో రాజ్ కుమార్ హిరాణి తెర‌కెక్కించిన డుంకీ విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వ‌స్తున్న స‌లార్‌తో డుంకీ పోటీప‌డ‌నుండ‌గా స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ఈలోగానే 2017 చిత్రం 'కామ్రేడ్ ఇన్ అమెరికా'తో షారూఖ్ ఖాన్ 'డుంకీ'కి కొన్ని సారూప్యతలు ఉన్నాయ‌ని పుకార్లు వ్యాపించాయి. 2017 భారతీయ యాక్షన్ చిత్రం 'కామ్రేడ్ ఇన్ అమెరికా'ని షార్ట్ క‌ట్ లో CIA అని పిలుస్తారు. దీనికి అమల్ నీరద్ దర్శకత్వం వహించారు. దుల్కర్ సల్మాన్, కార్తీక మురళీధరన్ కీలక పాత్రల్లో నటించారు.

కామ్రేడ్ ఇన్ అమెరికా కథాంశం అమెరికాలో దుల్కర్ సల్మాన్ ప్రయాణం చుట్టూ తిరుగుతుంది. కేరళకు చెందిన ఒక కమ్యూనిస్ట్ లాటిన్ అమెరికా, మెక్సికన్ సరిహద్దుల మీదుగా యునైటెడ్ స్టేట్స్‌కు అక్రమంగా ప్రయాణించి తన స్నేహితురాలు సారాను, అలాగే బలవంతంగా మరొక యువ‌తిని వివాహం చేసుకోవలసి వస్తుంది. ఆపై ఏం జ‌రిగింద‌న్న‌దే ఈ సినిమా క‌థాంశం. అయితే డుంకీ క‌థాంశం విదేశాల‌కు వెళ్లే భార‌తీయుల క‌ష్ట‌న‌ష్టాల గురించిన చిత్ర‌మ‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. చట్టవిరుద్ధమైన ఇమ్మిగ్రేషన్ టెక్నిక్ గురించి డుంకీలో చర్చించ‌నున్నారు. అయితే దుల్కార్ సినిమా ఇప్ప‌టికే విడుద‌లై రిజ‌ల్ట్ అందుకుంది. కానీ డుంకీ ఇంకా విడుద‌ల కావాల్సిన సినిమా. విదేశీ నేప‌థ్యం ఉన్నంత మాత్రాన ఇవి రెండూ వైవిధ్యంగా ఉండ‌వ‌ని చెప్ప‌గ‌ల‌రా?... ఆలోచించాలి.

అంతా ట్రాష్ అంటూ..

కొంద‌రు అభిమానులు ఈ పోలిక అంతా ట్రాష్ అని కొట్టి పారేస్తున్నారు. ఇది రాజు హిరాణీ సినిమా. ఈ చిత్రం రీమేక్ కాద‌ని అంద‌రికీ తెలుసు. ఇక్కడ మీ (రాసిన జ‌ర్న‌లిస్ట్) ఉద్దేశం అందరికీ తెలుసు. చాలా తెలివిగా రెండు చిత్రాల లాగ్‌లైన్‌ను మీరు ఇక్కడ పోస్ట్ చేసారు. తద్వారా ద్వేషంతో గొడవపడేలా చేస్తున్నారు. మీరు నిజంగా ఒక సినిమా ఔత్సాహికుడిలా సారూప్యతలను ఎత్తి చూపుతూ ఉంటే లేదా సమాంతరంగా చూస్తుంటే, మీరు పరిణతి చెందిన వ్యక్తిలా ఇద్దరి సారూప్యతపై వ్యాఖ్యానించేవారు. కానీ మీరు మీకు ప్రయోజనం కలిగించే పనిని ఎంచుకున్నారు. జర్నలిస్ట్ అయినందుకు సిగ్గుపడాలి. నిజ‌మైన అభిమానులు కేవలం ఒక టీనేజ్ ఫ్యాన్‌బాయ్ లాగా ఉంటారు. అయితే ఈ జ‌ర్న‌లిస్టు మాత్రం ఉద్ధేశ పూర్వ‌కంగా ఏదో రాస్తూ ఇంకేదో సాధించాల‌నుకుంటాడు! అని కూడా కామెంట్ చేసారు. వృత్తిప‌రంగా మీరు బాధ్యులుగా ఉండాల‌ని కూడా కామెంట్ చేసారు.