Begin typing your search above and press return to search.

వీడియో : త్రివిక్రమ్‌ బర్త్‌ డే స్పెషల్‌ దమ్‌ మసాలా బిర్యానీ అదిరింది

దర్శకుడు త్రివిక్రమ్‌ బర్త్‌ డే సందర్భంగా విడుదల అయిన దమ్‌ మసాలా బిర్యానీ సాంగ్ కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

By:  Tupaki Desk   |   7 Nov 2023 11:21 AM GMT
వీడియో : త్రివిక్రమ్‌ బర్త్‌ డే స్పెషల్‌ దమ్‌ మసాలా బిర్యానీ అదిరింది
X

సూపర్ స్టార్‌ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా ను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖులు మరియు మీడియా వర్గాల వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు గుంటూరు కారం ఫస్ట్‌ సింగిల్ వచ్చేసింది.


దర్శకుడు త్రివిక్రమ్‌ బర్త్‌ డే సందర్భంగా విడుదల అయిన దమ్‌ మసాలా బిర్యానీ సాంగ్ కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ పాటకు థమన్‌ సంగీతాన్ని అందించగా సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ను అందించారు. వీరిద్దరి కాంబోలో ఈ మధ్య కాలంలో వచ్చిన పలు పాటలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.


మహేష్ బాబు పాత్రను కాస్త రివీల్‌ చేయడంతో పాటు, విజువల్స్ ను కూడా ఈ లిరికల్‌ వీడియోలో రివీల్‌ చేయడంతో ఫ్యాన్స్ కి కన్నుల పండుగ అన్నట్లుగా ఉంది. ఈ పాటను సంజిత్ హెగ్డే మరియు థమన్ లు కలిసి ఆలపించారు. ఇద్దరూ కూడా పోటీ పడి పాడినట్లు ఉంది. మహేష్ ఇమేజ్ కి తగ్గట్లుగా మ్యూజిక్‌ ఉందని, అలాగే లిరిక్స్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి.

మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీల నటిస్తోంది. మరో ముఖ్య పాత్రలో మీనాక్షి చౌదరి నటిస్తున్న విషయం తెల్సిందే. త్రివిక్రమ్‌ మరియు మహేష్ బాబు కాంబోలో గతంలో వచ్చిన అతడు మరియు ఖలేజా కమర్షియల్ గా నిరాశ పరిచాయి. కానీ ఈ సినిమా కచ్చితంగా ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. పుష్కర కాలంగా ఎదురు చూస్తున్న వీరి కాంబో మూవీ వస్తున్న నేపథ్యంలో అభిమానులు సంక్రాంతికి డబుల్‌ ధమాకా ఖాయం అన్నట్టుగా చాలా ధీమాతో ఉన్నారు.