Begin typing your search above and press return to search.

దుల్కర్.. ఈ సారి అలా మ్యాజిక్ చేయగలడా?

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగారు దుల్కర్‌ సల్మాన్‌

By:  Tupaki Desk   |   18 Aug 2023 6:28 AM GMT
దుల్కర్.. ఈ సారి అలా మ్యాజిక్ చేయగలడా?
X

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగారు దుల్కర్‌ సల్మాన్‌. మహానటితో మంచి గుర్తింపు తెచ్చుకుని టాలీవుడ్ ఆడియెన్స్ కు కూడా చేరువయ్యారు. ఇక సీతారామంతో ప్రేక్షకుల అభిమాన హీరోగా కూడా మారిపోయారు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చేస్తూ పాన్ ఇండియా హీరోగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు ఆయన నుంచి వారం గ్యాప్ లో ఓ వెబ్ సిరీస్ తో ఓ సినిమాతో అభిమానుల ముందుకు రానున్నారు.

ఆగస్ట్ 18 నుంచి గన్స్ అండ్ గులాబ్స్, 24న(గురువారం) కింగ్ ఆఫ్ కోతగా రాబోతున్నారు. వెబ్ సిరీస్ పక్కన పెడితే.. ఈ సినిమాపై మాత్రం అంచనాలు బాగానే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ చూస్తుంటే.. కంటెంట్ ప్రామిసింగ్ గానే అనిపిస్తోంది. అభిలాష్ జోషి దర్శకత్వం వహించారు. ఐశ్యర్య మేనన్ హీరోయిన్ గా నటించింది. కేజీయఫ్ రేంజ్ లో కాకపోయిన ఈ చిత్రం.. ఆ స్థాయికి కాస్త దగ్గరగానే కనిపిస్తోంది.

ఇప్పటికే ఎలాగో దుల్కర్ కు పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ ఉంది. కాబట్టి మలయాళంతో పాటు మిగతా ఇండస్ట్రీలలోనూ మంచి ఓపెనింగ్స్ వస్తాయని భావిస్తున్నారు మేకర్స్. పైగా వేరే రిలీజులు లేని గురువారమే ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా వస్తోంది. ఇది కూడా కాస్త కలిసొచ్చే అవకాశముంది. ముఖ్యంగా టాలీవుడ్ బాక్సాఫీస్ విషయానికొస్తే.. ఇప్పటికే ఇక్కడ దుల్కర్ కు మంచి మార్కెట్ ఉంది.

మహానటి, సీతారామం లాంటి స్ట్రెట్ మూవీస్ బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. కనులు కనులు దోచాయంటే, కురుప్ చిత్రాలు కమర్షియల్ గానూ నిర్మాతలకు బానే తెచ్చిపెట్టాయి. ఒక్క హే సినామిక మాత్రమే కాస్త బోల్తా కొట్టింది. ఈ సినిమాల రిజల్ట్ నేపథ్యంలో కింగ్ అఫ్ కోతపై పాజిటివ్ నే హైప్ ఉంది. పైగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నేచరల్ స్టార్ నాని, రానా కూడా వచ్చి సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేశారు.

దీనికి తోడు ఈ మధ్యలో టాలీవుడ్ లో డబ్బింగ్ చిత్రాలకు మంచి ఆదరణ పెరుగుతోంది. పొన్నియిన్ సెల్వన్ మంచిగానే ఆడగా.. విక్రమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం రజనీ జైలర్ మంచి లాభాలను తెచ్చిపెడుతోంది. రాబయో విజయ్ దళపతి లియో మంచి ధరకే అమ్ముడుపోయిందట. సూర్య కంగువా కూడా డిమాండ్ బాగానే ఉంది. కాబట్టి మన తెలుగు ఆడియన్స్ కు బాషా భేదాలు ఉండవన్న సంగతి తెలిసిందే. కంటెంట్ బాగుంటే హీరో ఎవరైన సరే సినిమాకు జై కొడతారు. కాబట్టి ఇప్పటికే ఎలాగో దుల్కర్ పై పాజిటివ్ రెస్పాన్స్ ఉంది కాబట్టి.. కింగ్ ఆఫ్ కోతకు చూసేందుకు రెడీగానే ఉన్నారు. చూడాలి మరి ఈ చిత్రం కంటెంట్ పరంగా ఎలా ఉంటుందో, మహానటి, సీతారమం రేంజ్ లో దుల్కర్ హిట్ ను అందుకుంటారో లేదో..