Begin typing your search above and press return to search.

దుల్కర్ మరో తెలుగు సినిమా.. ఈసారి కాస్త క్రేజీగా

ఇప్పుడు దుల్కర్ సల్మాన్ తో ఈ మూవీని కన్ఫర్మ్ చేసుకొని అఫీషియల్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఎనౌన్స్ చేశారు.

By:  Tupaki Desk   |   28 July 2023 9:59 AM GMT
దుల్కర్ మరో తెలుగు సినిమా.. ఈసారి కాస్త క్రేజీగా
X

మలయాళీ యాక్టర్ గా కెరియర్ ప్రారంభించిన దుల్కర్ సల్మాన్ తక్కువ టైంలోనే నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు. మహానటి మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. గత ఏడాది సీతారామం సినిమాతో కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం రిలీజ్ అయిన అన్ని భాషలలో సూపర్ హిట్ అయ్యింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో క్లాసిక్ చిత్రాల సరసన సీతారామం కూడా చేరిపోతుంది.

అంతలా ఈ సినిమా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యింది. అలాగే మూవీలో దుల్కర్ సల్మాన్ పెర్ఫర్మెన్స్ కి కూడా అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. ఈ సినిమాతో తెలుగులో కూడా దుల్కర్ కి మంచి మార్కెట్ క్రియేట్ అయ్యిందని చెప్పొచ్చు. ప్రస్తుతం దుల్కర్ మలయాళంలో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. మాఫియా బ్యాక్ డ్రాప్ కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీని తర్వాత మరల తెలుగులో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

సార్ మూవీతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకున్న వెంకీ అట్లూరి మరల సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఇంకో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ తో ఈ మూవీని కన్ఫర్మ్ చేసుకొని అఫీషియల్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఎనౌన్స్ చేశారు. ఓ కామన్ మెన్ ఊహించని విధంగా కోటీశ్వరుడుగా ఎలా మారాడు అనే పాయింట్ తోనే ఈ మూవీ కథ ఉంటుందని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

అయితే దుల్కర్ సల్మాన్ నుంచి వచ్చిన గత రెండు తెలుసు సినిమాలు సీరియస్ నోట్ లో ఉంటాయి. అయితే పోస్టర్ ఈ మూవీ టైటిల్ బట్టి చూస్తే కచ్చితం దుల్కర్ లోని ఎంటర్టైన్మెంట్ కోణాన్ని కూడా బయటకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. లక్కీ భాస్కర్ అని ఈ చిత్రానికి టైటిల్ పెట్టారు. అలాగే పోస్టర్ లో డబ్బుని చూపిస్తూ వాటి మధ్యలో దుల్కర్ సల్మాన్ పేస్ ని రివీల్ చేశారు.

ఇక ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. నవీన్ నూలి ఎడిటర్. అయితే హీరోయిన్ ఎవరనేది మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. సితార ఎంటర్టైన్మెంట్స్ తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ కూడా ఈ చిత్రంలో నిర్మాణ భాగస్వామిగా ఉంది. మరి ఈ చిత్రంలో దుల్కర్ టాలీవుడ్ హ్యాట్రిక్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.