Begin typing your search above and press return to search.

దుల్కర్ సల్మాన్.. మరో కిక్కిచ్చే కాంబో!

ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని దుల్కర్ సల్మాన్ ని సంప్రదించారంట.

By:  Tupaki Desk   |   22 April 2024 4:12 AM GMT
దుల్కర్ సల్మాన్.. మరో కిక్కిచ్చే కాంబో!
X

సీతారామం సినిమాలో కల్నల్ రామ్ క్యారెక్టర్ లో దేశ వ్యాప్తంగా అందరికి చేరువ అయిన మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్. మాతృభాష మలయాళంలో స్టార్ హీరోగా సక్సెస్ అయిన దుల్కర్ సల్మాన్ ఇప్పుడు హిందీ, తమిళ్, తెలుగు భాషలకి తన మార్కెట్ విస్తరించుకున్నాడు. ప్రస్తుతం తెలుగులో వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీభాస్కర్ అనే మూవీ చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం నడుస్తోంది. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. రీసెంట్ గా వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ నుంచి దుల్కర్ సల్మాన్ కి మంచి ఆఫర్స్ లభిస్తున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేసే వారు తమ సినిమాలలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రల కోసం దుల్కర్ సల్మాన్ ని సంప్రదిస్తున్నారు.

దుల్కర్ కూడా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ బట్టి ఇతర హీరోల సినిమాలలో నటిస్తున్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో చేస్తోన్న సినిమాలో ఓ కీరోల్ పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో క్రేజీ మూవీకి ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. తేజా సజ్జా లీడ్ రోల్ లో కార్తిక్ ఘట్టమనేని మిరాయ్ అనే మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే.

రీసెంట్ గా మూవీ టైటిల్, అండ్ టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ చాలా ప్రామిసింగ్ తో ఇంటరెస్ట్ క్రియేట్ చేసే విధంగా ఉంది. ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని దుల్కర్ సల్మాన్ ని సంప్రదించారంట. కథ నచ్చడంతో అతను ఒకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తోంది.

హనుమాన్ సినిమాతో ఇప్పటికే తేజా సజ్జా పాన్ ఇండియా రేంజ్ లో ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు మిరాయ్ తో సామ్రాట్ అశోక సీక్రెట్ సూపర్ హీరోల కథతో మరోసారి సత్తా చాటడానికి సిద్ధం అవుతున్నాడు. హనుమాన్ కి సంగీతం అందించిన గౌర హరీష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తూ ఉండటం విశేషం. మరి దుల్కర్ సల్మాన్ కి ఈ చిత్రంలో కార్తిక్ ఘట్టమనేని ఎలాంటి రోల్ ని ఆఫర్ చేశారనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. కార్తిక్ ఘట్టమనేని చివరిగా ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి డిజాస్టర్ అందుకున్నారు. అయితే మిరాయ్ లో అద్భుతమైన హిస్టరీ ఉంది కాబట్టి కచ్చితంగా సాలిడ్ గా ప్రెజెంట్ చేసే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.