Begin typing your search above and press return to search.

అదేంటో ఆ హీరో అంటే పీరియాడికల్ ఫిక్స్ అయ్యేలా చేశారు..!

మలయాళంలో తన మార్క్ సినిమాలతో అలరిస్తున్న దుల్కర్ సల్మాన్ తెలుగులో మాత్రం డిఫరెంట్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకుంటున్నాడు.

By:  Tupaki Desk   |   12 April 2024 7:16 AM GMT
అదేంటో ఆ హీరో అంటే పీరియాడికల్ ఫిక్స్ అయ్యేలా చేశారు..!
X

మలయాళంలో తన మార్క్ సినిమాలతో అలరిస్తున్న దుల్కర్ సల్మాన్ తెలుగులో మాత్రం డిఫరెంట్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. మహానటి సినిమాలో జెమిని గణేష్ పాత్రలో సూపర్ అనిపించుకున్న దుల్కర్ సల్మాన్ సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. టాలీవుడ్ లో దుల్కర్ చేస్తున్న సినిమాలన్నీ కూడా కొత్తగా ఉంటున్నాయి. ముఖ్యంగా అతను పీరియాడికల్ సినిమాల్లో నటిస్తూ హిట్లు కొడుతున్నాడు. మహానటి సినిమా సావిత్రమ్మ జీవితంలో జరిగిన సంఘటనలతో తెరకెక్కించారు.

సీతారామం సినిమా కూడా ఒకప్పుడు జరిగిన కథగా చెబుతారు. ఇక లేటెస్ట్ గా దుల్కర్ సల్మాన్ చేస్తున్న లక్కీ భాస్కర్ సినిమా కూడా అదే తరహాలో వస్తుంది. బ్యాంక్ ఎంప్లాయి గా చేసే భాస్కర్ కు అనుకోకుండా లక్కీ డ్రా తగిలితే కోట్లకి అధిపతి అవుతాడు. ఆ తర్వాత అతని లైఫ్ లో జరిగిన సంఘటనలే ఈ లక్కీ భాస్కర్ కథాంశం. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజైంది.

లక్కీ భాస్కర్ టీజర్ తో సినిమాపై బజ్ పెంచారు. దుల్కర్ సల్మాన్ చేస్తున్న ప్రతి సినిమా పీరియాడికల్ గా ఉండటం ప్రత్యేకంగా ఉంటుంది. మహానటి, సీతారామం తర్వాత యాదృచ్చికంగా లక్కీ భాస్కర్ కూడా పీరియాడికల్ కథగానే చెబుతున్నారు. మరి దుల్కర్ అంటేనే పీరియాడికల్ మూవీ అని ఆడియన్స్ గుర్తుంచుకునేలా అతని సినిమాలు ఉంటున్నాయని చెప్పొచ్చు. లక్కీ భాస్కర్ తో పాటుగా దుల్కర్ సల్మాన్ నందమూరి బాలకృష్ణ 109 సినిమాలో కూడా భాగం అవుతున్నాడు.

బాలకృష్ణ సినిమాలో దుల్కర్ సల్మాన్ అనగానే సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాలో దుల్కర్ ఎలాంటి పాత్రలో కనిపిస్తున్నాడు అన్నది సస్పెన్స్ గా ఉంది. అయితే మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో వస్తున్న థగ్ లైఫ్ సినిమాకు ముందు దుల్కర్ సైన్ చేసినా రీసెంట్ గా ఆ సినిమా నుంచి ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది. తెలుగులో మాత్రం దుల్కర్ వరుస సినిమాలతో తన రేంజ్ పెంచుకుంటూ వస్తున్నాడు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న లక్కీ భాస్కర్ తో వెంకీ అట్లూరి మరోసారి తన డైరెక్షన్ టాలెంట్ చూపించాలని ఫిక్స్ అయ్యాడు. తెలుగు ఆడియన్స్ తనపై చూపిస్తున్న ఈ ప్రేమను కొనసాగించేలా వెరైటీ కథలు పాత్రలతో దుల్కర్ క్రేజీ అటెంప్ట్ చేస్తున్నాడు. అంతేకాదు అతనితో చేస్తున్న సినిమాలు సూపర్ సక్సెస్ లు అవుతుండటంతో దుల్కర్ తో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.