దుల్కర్ వదిలేసి మంచి పని చేశాడు
దుల్కర్ సల్మాన్ సినిమాల సెలక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడనే సంగతి తెలిసిందే. అందుకే తన సినిమాలు అంత స్పెషల్ గా ఉంటాయి
By: Tupaki Desk | 7 Jun 2025 4:00 AM ISTకొంత మంది ఆర్టిస్టులు రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ రెగ్యులర్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి వారిని ఎంటర్టైన్ చేయాలనుకుంటే, మరికొంత మంది ఆర్టిస్టులు మాత్రం ఎంత టైమ్ పట్టినా పర్లేదు, ఒక్క సినిమా చేసినా దాంతో ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించాలనుకుంటారు. ఇందులో రెండవ కేటగిరీకి చెందిన వాడు దుల్కర్ సల్మాన్.
దుల్కర్ సల్మాన్ సినిమాల సెలక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడనే సంగతి తెలిసిందే. అందుకే తన సినిమాలు అంత స్పెషల్ గా ఉంటాయి. దుల్కర్ ఇప్పటివరకు తెలుగులో మూడు సినిమాలు చేశాడు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్. ఈ మూడు సినిమాలూ మంచి హిట్లుగా నిలవడంతో పాటూ అందులోని ప్రతీ ప్రాత ఆడియన్స్ కు గుర్తుండిపోయేలా నటించి మెప్పించాడు దుల్కర్.
ప్రస్తుతం దుల్కర్ రానా దగ్గుబాటి ప్రొడక్షన్ లో కాంత సినిమా చేస్తున్నాడు. కాంత సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాలు చాలా పాజిటివ్ గా చెప్తున్నాయి. ఇక అసలు విషయానికొస్తే గత కొన్ని సినిమాలుగా దుల్కర్ సినిమాల ఎంపిక విషయంలో ఎంతో ఆచితూచి వ్యవహరిస్తూ, ఏదైనా డౌట్ వచ్చినా సరే ఆ సినిమా నుంచి తెలివిగా తప్పించుకుంటున్నాడు తప్పించి తొందరపడి చేసి తర్వాత ఫీలవడం లేదు.
రీసెంట్ గా కమల్ హాసన్ హీరోగా వచ్చిన థగ్ లైఫ్ సినిమాలో శింబు చేసిన పాత్ర కోసం ముందు దుల్కర్ నే అనుకుని అనౌన్స్ కూడా చేశారు. కానీ అదే టైమ్ లో దుల్కర్ లక్కీ భాస్కర్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో థగ్ లైఫ్ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేక తప్పుకున్నాడు. కానీ మల్లువూడ్ మీడియా అయితే ఆ పాత్రలో సరైన జీవం లేదనే దుల్కర్ ఆ ప్రాజెక్టు నుంచి తెలివిగా తప్పుకున్నాడని అంటోంది.
అన్ని యాంగిల్స్ లో ఆలోచించే థగ్ లైఫ్ సినిమాను దుల్కర్ మిస్ చేసుకున్నాడని అంటున్నారు. థగ్ లైఫ్ లో శింబు క్యారెక్టర్ ఆడియన్స్ కు ఏ మాత్రం కనెక్ట్ అవలేదు. ఒకవేళ దుల్కర్ ఈ సినిమా చేసినా దాని వల్ల అతనికి లాభం రాకపోగా అతని కెరీర్ కు నష్టమే వచ్చేది. అందుకే థగ్ లైఫ్ సినిమాను చూసిన వాళ్లంతా దుల్కర్ ఆ సినిమాను చాలా తెలివిగా తప్పించుకున్నాడని అంటున్నారు.
