Begin typing your search above and press return to search.

దుల్కర్ సల్మాన్ మరో తెలుగు సినిమా..?

ఇదిలా ఉంటే దుల్కర్ సల్మాన్ తో తెలుగు బడా నిర్మాత ఒకరు కొత్త సినిమా కోసం అప్రోచ్ అయినట్టు తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   3 July 2025 8:00 AM IST
దుల్కర్ సల్మాన్ మరో తెలుగు సినిమా..?
X

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు. మహానటితో మెప్పించిన అతను ఆ నెక్స్ట్ సీతారామం తో సూపర్ హిట్ కొట్టాడు. ఇక లక్కీ భాస్కర్ తో మరో సూపర్ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు. అదేంటో తన సొంత భాష మలయాళంలో కూడా దుల్కర్ కి ఇలాంటి క్రేజీ హిట్లు రాలేదు. అక్కడ సక్సెస్ కొట్టినా సరే ఈ రేంజ్ వసూళ్లను రాబట్టలేదు. దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమా అంటే అది పక్కా హిట్ అనేంతగా క్రేజ్ తెచ్చుకున్నాడు.

మహానటి, సీతారామం తోనే కాదు లక్కీ భాస్కర్ తో ఆ సెంటిమెంట్ మరింత బలపడింది. అందుకే దర్శక నిర్మాతలు దుల్కర్ తో సినిమాలకు రెడీ అవుతున్నారు. దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం కాంత సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో రానా కూడా నటిస్తున్నాడు. మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్య శ్రీ హీరోయిన్ గా నటిస్తుంది. దుల్కర్ సల్మాన్ ఈ సినిమాతో కూడా మరో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు.

ఇదిలా ఉంటే దుల్కర్ సల్మాన్ తో తెలుగు బడా నిర్మాత ఒకరు కొత్త సినిమా కోసం అప్రోచ్ అయినట్టు తెలుస్తుంది. ఐతే తెలుగు ఆఫర్ అంటే దుల్కర్ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాడు. అంతేకాదు ఆ సినిమా స్టోరీ కూడా సర్ ప్రైజింగ్ గా ఉందని తెలుస్తుంది. దుల్కర్ సల్మాన్ ఇప్పుడు ఏకంగా తెలుగు స్ట్రైట్ హీరోలానే సినిమాలు చేస్తున్నాడు. తీసిన మూడు సినిమాలు కూడా హిట్ అవ్వడంతో అతనికి టాలీవుడ్ లో మార్కెట్ కూడా బాగా పెరిగింది.

సక్సెస్ ఫుల్ సినిమాలతో పాటు కథల విషయంలో దుల్కర్ క్లవర్ నెస్ ఆడియన్స్ ని మెప్పిస్తుంది. తప్పకుండా దుల్కర్ సల్మాన్ మరో అద్భుతమైన సినిమాలతో వస్తాడని చెప్పొచ్చు. మలయాళంలో దుల్కర్ చేస్తున్న ప్రయత్నాలు కూడా అతని ఇమేజ్ కి తగినట్టుగానే ఫలితాలు సాధిస్తున్నాయి. ఐతే బోనస్ గా తెలుగు మార్కెట్ దుల్కర్ క్రేజ్ ని డబుల్ చేసింది. ఐతే దుల్కర్ తో ఈసారి తెలుగు మేకర్స్ పాన్ ఇండియా లెవెల్ లో భారీ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అది ఓకే అయితే మాత్రం తప్పకుండా దుల్కర్ కి అది మరో క్రేజీ సినిమా అయ్యేలా ఉందనిపిస్తుంది.