దుల్కర్ సల్మాన్ నిజంగా లక్కీయెస్ట్ ఫెల్లోనే!
దుల్కర్ సల్మాన్ ఓ మలయాళ హీరో. కానీ దక్షిణాది భాషలతో పాటు ఉత్తరాది ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంటూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు.
By: Tupaki Desk | 14 Jun 2025 1:07 PM ISTదుల్కర్ సల్మాన్ ఓ మలయాళ హీరో. కానీ దక్షిణాది భాషలతో పాటు ఉత్తరాది ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంటూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. హీరోగా విలక్షణమైన కథలని ఎంచుకుంటూ మాతృ భాషకు మించి ఇతర భాషల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ భారీ ఫ్యాన్ బేస్‌ని ఏర్పాటు చేసుకున్నాడు. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తున్న దుల్కర్ సల్మాన్ ఇటీవల తెలుగులో నటించిన `లక్కీ భాస్కర్`తో భారీ బ్లాక్ బస్టర్‌ని దక్కించుకుని హీరోగా మరో మెట్టు ఎక్కడిన విషయం తెలిసిందే.
`లక్కీ భాస్కర్` తరువాత తెలుగు, మలయాళ భాషల్లో మూడు సినిమాలు చేస్తున్నాడు దుల్కర్. కాంత, ఆకాశంలో ఒక తార`తో పాటు మలయాళంలో `ఐయామ్ గేమ్` చేస్తున్నాడు. దీనికి తనే నిర్మాత కూడా. ప్రస్తుతం మూడుసినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న దుల్కర్ సల్మాన్‌ని అంతా లక్కీయెస్ట్ ఫెల్లో అంటున్నారు. దీంతో దుల్కర్ మరోసారి వార్తల్లో నిలుస్తున్నాడు. దుల్కర్‌ని లక్కీయెస్ట్ ఫెల్లో అని అంతా పిలుస్తుండటానికి బలమైన కారహే ఉంది. ఇటీవల దుల్కర్‌కు రెండు భారీ ఆఫర్లు వచ్చాయి.
ఒకటి కమల్ హాసన్, శంకర్‌ల కలయికలో వచ్చిన `ఇండియన్ 2`. ఇందులో సిద్ధార్ధ్ పోషించిన పాత్ర కోసం ముందు శంకర్ ..దుల్కర్‌ని సంప్రదించారట. ఆ క్యారెక్ట్ చేయడం ఇష్టం లేని దుల్కర్ దర్శకుడు శంకర్ ఇచ్చిన ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించాడట. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్ట్‌గా నిలిచి శంకర్‌కు, కమల్‌కు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత మరో ఆఫర్ దుల్కర్ తలుపు తట్టింది. అది కూడా కమల్ సినిమానే. మణిరత్నం, కమల్ కలిసి కొన్నేళ్ల విరామం తరువాత చేసిన మూవీ `థగ్ లైఫ్`.
ఇందులో శింబు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ పాత్రని ముందు దుల్కర్‌కు ఆఫర్ చేశారట. అయితే మణిరత్నం ఇచ్చిన ఆఫర్‌ని దుల్కర్ సున్నితంగా తిరస్కరించి ఈ ప్రాజెక్ట్ చేయలేనని చెప్పాడట. ఆ తరువాతే ఆ క్యారెక్టర్‌ని మణిరత్నం హీరో శింబుతో చేయించారు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచి షాక్ ఇచ్చింది. ఇలా రెండు సార్లు తెలివిగా దుల్కర్ డిజాస్టర్ల నుంచి తప్పించుకోవడంతో దుల్కర్ లక్కీ కాదు లక్కీయెస్ట్ ఫెల్లో అని అంతా తనని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
