మూడు డిజాస్టర్ల నుంచి భలే ఎస్కేప్ అయ్యాడే!
కొన్నిసార్లు హిట్ అయిన స్టోరీలు వదులుకుంటారు హీరోలు. అలాంటప్పుడు ఆ సినిమా నేను చేయాల్సిం దే అని ముందుకొచ్చి మరీ చెబుతారు.
By: Tupaki Desk | 6 July 2025 5:34 PMకొన్నిసార్లు హిట్ అయిన స్టోరీలు వదులుకుంటారు హీరోలు. అలాంటప్పుడు ఆ సినిమా నేను చేయాల్సిం దే అని ముందుకొచ్చి మరీ చెబుతారు. అదే సినిమా ప్లాప్ అయితే మాత్రం ఎలాంటి సౌండింగ్ ఉండదు. ఏ పరిశ్రమలోనైనా ఇది సహజమే. ఒక హీరో వద్దకు వచ్చిన స్క్రిప్ట్ నచ్చకపోవడంతో మరో హీరోకి వెళ్తుంది. అతడు హిట్ కొట్టొచ్చు. ప్లాప్ అందుకొవచ్చు. అదంతా రిలీజ్ తర్వాత తేలే సంగతి. ప్లాప్ అయితే మాత్రం భలే తప్పించుకున్నాం? అనే ఫీలింగ్ కలుగుతుంది.
తాజాగా మాలీవుడ్ స్టార్ దుల్కార్ సల్మాన్ అదే ఫీలింగ్ లో ఉండి ఉండొచ్చు. అలాంటి డిజాస్టర్ చిత్రాలను దుల్కర్ మూడింటిని వదలుకున్న సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ సారి ఆ సంగతి చూస్తే. కమల్ హాసన్ హీరోగా శంకర్ 'ఇండియన్ 2' తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇందులో సిద్దార్ద్ కీలక పాత్ర పోషిం చాడు. కానీ ఈ పాత్ర తొలుత దుల్కార్ వద్దకు వెళ్లింది. కానీ శంకర్ సినిమా అయినా దుల్కర్ ఎందుకనో ఈ ఛాన్స్ వదులుకున్నాడు.
అదే దుల్కార్ కు కలిసొచ్చింది. 'ఇండియాన్ 2' ఎలాంటి ఫలితాలు సాధించిందో తెలిసిందే. భారీ అంచ నాల మధ్య రిలీజ్ అయిన సినిమా డిజాస్టర్ అయింది. అటుపై కమల్ హాసన్ తోనే మణిరత్నం 'థగ్ లైప్' చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ అయింది. ఇందులో శింబు పోసిన పాత్రను దుల్కా ర్ పోషించాలి అట. కానీ ఈ అవకాశం కూడా దుల్కర్ వదులుకున్నాడు. ఈసినిమా కూడా పరాజయం చెందిన సంగతి తెలిసిందే.
అలాగే బాలీవుడ్ లో అక్షయ్ కుమార్-టైగర్ ష్రాప్ నటించిన 'బడే మియాన్ చోటే మియాన్' లో కూడా కీలక పాత్రకు దుల్కర్ పోషించాలి. కానీ ఆ ఛాన్స్ కూడా వదులుకున్నాడు. దీంతో ఆపాత్రను పృధ్వీరాజ్ సుకుమారన్ పోషించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం సాధించిందో తెలిసిందే. ఈ దశా బ్ధంలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఇలా మూడు పరాజయాల నుంచి దుల్కర్ తప్పించు కోగలిగాడు.