స్నేహితురాలిని సూపర్ హీరోని చేసాడు!
తన స్నేహితురాలి కోసం నిర్మాత అయ్యాడు. అంతేకాదు తన స్నేహితురాలిని సూపర్ హీరో (సూపర్ ఉమెన్) గా చూపించేందుకు భారీగా డబ్బును ఖర్చు చేస్తున్నాడు.
By: Tupaki Desk | 9 Jun 2025 9:58 AM ISTతన స్నేహితురాలి కోసం నిర్మాత అయ్యాడు. అంతేకాదు తన స్నేహితురాలిని సూపర్ హీరో (సూపర్ ఉమెన్) గా చూపించేందుకు భారీగా డబ్బును ఖర్చు చేస్తున్నాడు. స్నేహం కోసం అతడు చేస్తున్నది అంతా ఇంతా కాదు. ప్రస్తుతం మాలీవుడ్ లో దీని గురించి ఆసక్తికరంగా ముచ్చటించుకుంటున్నారు. ఆ హీరో ఎవరో కాదు.. ట్యాలెంటెడ్ యంగ్ హీరో దుల్కార్ సల్మాన్. మమ్ముట్టి నటవారసుడు. ఆ హీరోయిన్ ఎవరో కాదు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన ప్రియదర్శిని. మలయాళ దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్ వారసురాలు.
ఫ్రెండు ప్రియదర్శినిని సూపర్ ఉమెన్ గా ఆవిష్కరించేందుకు దుల్కార్ సల్మాన్ చాలా సాహసం చేస్తున్నాడు. స్నేహమంటే ఇదేనని నిరూపించేందుకు అతడు చాలా డబ్బును రిస్క్ చేస్తున్నాడు. పెద్ద బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నాడు. మమ్ముట్టి కుమారుడు, ప్రియదర్శన్ కుమార్తె స్నేహం ఇండస్ట్రీలో ఎల్లపుడూ చర్చనీయాంశం. ఇప్పుడు కూడా అతడు స్నేహితురాలి కోసం చేస్తున్న సాహసం గురించి ఆసక్తికరంగా ముచ్చటించుకుంటున్నారు. ప్రాజెక్ట్ వివరాల్లోకి వెళితే.. ఆసక్తికర విషయాలు తెలిసాయి.
ఇటీవలే 'లోకా - చాప్టర్ వన్: చంద్ర' అనే సినిమాని దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌లో దుల్కార్ ప్రారంభించాడు. ఇందులో ప్రియదర్శిని సూపర్ లేడీగా నటిస్తుంది. ఇది లార్జర్ దేన్ లైఫ్ పాత్ర. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేయగా ప్రియదర్శిని లుక్ కి మంచి స్పందన లభించింది. డొమినిక్ అరుణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్ కె. గఫూర్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కళ్యాణి తన కెరీర్‌లో మొదటిసారిగా సూపర్ హీరో పాత్రను పోషిస్తోంది. `లోకా` అనే పూర్తి స్థాయి మలయాళ సూపర్ హీరో సినిమాటిక్ విశ్వానికి నాంది పలికామని, ఇందులో వరుసగా సినిమాలు చేస్తామని నిర్మాత దుల్కార్ చెప్పాడు.
