Begin typing your search above and press return to search.

దుల్కర్ సల్మాన్ 'కాంత'.. కొత్త అప్డేట్ ఏంటంటే?

ఇప్పుడు కాంత మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 July 2025 12:52 AM IST
దుల్కర్ సల్మాన్ కాంత.. కొత్త అప్డేట్ ఏంటంటే?
X

మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. మహానటి మూవీతో తెలుగు సినీ ప్రియులను మెప్పించిన ఆయన.. ఆ తర్వాత సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో మంచి హిట్స్ ను అందుకున్నారు. హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మరిన్ని చిత్రాలు చేస్తున్నారు.


ఇప్పుడు కాంత మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, వేఫారేర్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌ పై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్.. భారీ బడ్జెట్ తో కాంత మూవీని నిర్మిస్తున్నారు.

రానా నిర్మాతగా వ్యవహరిస్తూనే కీలక పాత్ర కూడా పోషిస్తున్నారు. సముద్రఖని కూడా ముఖ్యమైన రోల్ లో కనిపించనున్నారు. 1950 మద్రాసులో జరిగిన ఒక ఉత్కంఠమరితమైన నాటకీయ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న కాంత మూవీ.. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ ను మేకర్స్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను జరుపుతున్నారు మేకర్స్. అదే సమయంలో కొద్ది రోజుల క్రితం దుల్కర్ సల్మాన్ లుక్ ను రివీల్ చేశారు మేకర్స్. రెట్రో లుక్ లో ఆకట్టుకున్న ఆయన.. న్యూ హెయిర్ స్టైల్ తో, సూట్ వేసుకుని సందడి చేశారు. ఇంటెన్స్ లుక్స్ తో మెప్పించారు. ఇప్పుడు కాంత మేకర్స్ తాజాగా మరో అప్డేట్ ను ఇచ్చారు.

టీజర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. దాంతోపాటు గ్లింప్స్ అండ్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ లో దుల్కర్ సల్మాన్ రెట్రో లుక్ లో ఉండగా.. క్రేజీగా నవ్వుతూ కనిపించారు. గ్లింప్స్ లో లెజండరీ పర్సన్ బర్త్ ను వీట్నెస్ చేయండంటూ మేకర్స్ కోరారు.

అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో కాంత మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంట్రెస్టింగ్ గా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సినిమపై అంచనాలు పెరుగుతున్నాయని అంటున్నారు. దుల్కర్ సల్మాన్ కు మరో హిట్ దక్కేలా ఉందని చెబుతున్నారు. కాంత టీజర్.. మరికొన్ని గంటల్లో విడుదల అయ్యి ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.